1. ఊరడిస్తున్న వాస్తవ కథనం_ఊపిరై తానుంటానంటూ...!!
2. ప్రాణ వాయువు పక్కుమంటోంది_అక్షరమే నీ ఊపిరైందని...!!
3. మరలిపోతోంది కాలం_కనికట్టు మాయలో కకావికలమై...!!
4. దిగులుకు గుబులైంది_సంతోషం చోటడిగిందని...!!
5. నిశ్శబ్దమే నచ్చింది_మనుష్యుల మనసు మర్మాలు తెలిసాక...!!
6. మమేకమైన మనసుల సవ్వడులు_ఓదార్పుకి వారధులు..!!
7. అర్ధమూ మారింది_నిశ్శబ్దానికి నిట్టూర్పులు మెుదలై.. !!
8. చెప్పలేని మౌనాలే_మది కోటలో గాథలన్నీ....!!
9. గుట్టు విప్పని భావాలెన్నో ...గుండె గుప్పెడయినా..!!
10. పేర్చిన ఇటుకల్లో_జ్ఞాపకాల సమాధులు...!!
11. రతనాల రాశులవి_జీవించడం నేర్పిన అక్షరాలు...!!
12. తూనీగలా తుళ్ళింది_నీ తలపులు ఒంపిన వయ్యారమనుకుంటా...!!
13. విలాసాల వెర్రితలలు_మనో వికృతరూప ఆవిష్కరణలు..!!
14. కలతలు వెంబడిస్తున్నాయి_కష్టమైన నిజాన్ని భరించలేక...!!
15. వేకువ వద్దంటోంది_ముసుగు తొలిగిన మృగాలను చూడలేక...!!
16. మౌనం మనసు విప్పింది_నీ జ్ఞాపకాలు నాతోనేనని చెప్తూ...!!
17. అలక అలంకారమైన మెామది_అనునయాల అవసరం లేకుండా...!!
18. కాలమే తెలియలేదు_నీ అనురాగఝురిలో మునిగిన మదికి...!!
19. అపహాస్యం అయ్యింది_అభిమానాన్ని నడిరోడ్డున నిలబెట్టిన స్నేహం...!!
20. ఆత్మీయతానుబంధాలకు నిలయం_ప్రాణమెుకటైన మన స్నేహాం...!!
21. మీనమేషాలు లెక్కించదు చెలిమి_మనసుని ఆవహించిన మాధుర్యంలో...!!
22. జ్ఞాపకాలను వరించా_స్మ్రతిగా నిను మిగుల్చుకోలేక..!!
23. అపస్వరమే బావుంది_అసలు స్వరూపం బయటపడితే...!!
24. నానార్థాలెక్కువయ్యాయి_నరుని నాలుక వంపుల్లో పడి...!!
25. ఊసరవెల్లి సహజ లక్షణం_మనిషి నైజానికి ఆపాదిస్తూ...!!
26. దిగజారుడుతనానికి నిదర్శనం_మా(కా)టే'సిన మార్పు..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి