6, డిసెంబర్ 2017, బుధవారం
స్నేహానికి మరో కోణం...!!
నేస్తం,
స్నేహం ముసుగులో కొందరు చేసిన మోసాన్ని భరించాక ఈ నాలుగు మాటలు చెప్పాలనిపించింది. ఇంటి మనిషి అని నమ్మినందుకు ఇంటినే అల్లరి చేసి, ఎవరో ఒకరు కాస్త ఆవేశంలో, బాధలో ఆలోచనలేకుండా పెట్టిన దానికి నమ్మిన స్నేహితులని మోసం చేసిన మనిషి తానే మోసపోయానని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకరినో ఇద్దరినో మంచివాళ్ళు కాదని అనడం సహజం కానీ ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకువచ్చి వారి వెనుక వారిని చాలా చెడ్డగా మాట్లాడటం కొందరి సహజ లక్షణం. తన అవసరానికి అడ్డాగా నా స్నేహాన్ని, ఇంటిని వాడుకుని పాపం బోలెడు కష్టాలు నా ఇంట్లో పడ్డానని వారికి చెప్పి మరి కొందరి ఇండ్లలో చేరి వారిని అల్లరిపాలు చేసి, కాపురాల మధ్యన చిచ్చు పెట్టి, నా ఆప్తుల మీద నాకే చెప్పిన మా దొడ్డ ఇల్లాలు. తన అసలు రూపానికి తానే నాకు సాక్ష్యాలు ఇచ్చి, ఆత్మీయమైన స్నేహాన్ని అభాసుపాలు చేసిన మహా 'మనీ' 'షి'. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఏమి చెప్పలేని అశక్తురాలిని చేసిన ఘనత ఆమెది. తన అనుకున్న వారి దగ్గరే నా గురించి వాగితే వాళ్ళు అప్పటినుండి తననే దూరం పెట్టారు. తాను తప్ప అందరు పాతివ్రత్యం లేనివాళ్లే అని భావించే పతివ్రతాశిరోమణి తాను వాగిన వాగుడు బయటపడుతోందని అందరు ఒకరి గురించి ఒకరు అన్నారని చెప్పడం మొదలు పెట్టి నాలుగురోజులు పబ్బం గడుపుకుంటూ తన ఉనికి కోసం శాయశక్తులా కష్టపడుతోంది. ఇలాంటిదాన్ని, దాని మాటలను నమ్మినవాళ్లను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. దయచేసి దాని మాయలో పడకండి. బురదలో పద్మం వికశిస్తుంది కానీ ఈ పుట్టుకలో బురదలో మకిలే ఆభరణం. క్షేత్ర లక్షణాలు బాగా వంటబట్టాయి.
స్నేహాన్ని వ్యాపారంగా మార్చి లెక్కలు వేయడం, అనుబంధాలను అల్లరిపాలు చేయడం, ఆత్మీయతను మోసం చేయడం వంటివి వారికి వెన్నతో పెట్టిన విద్య అని తెలుసుకోలేక పోవడం నా తెలివితక్కువతనం. ముఖపుసక్తంలో మంచి చెడు ఉంటాయని మనమే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవు. ఒకరి మీద ఒకరికి చెప్పి ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటారో ఇలాంటి వాళ్ళు. నిజం అనేది ఎప్పటికయినా బయటపడుతుందని మర్చిపోతే ఎలా. పచ్చకామెర్లు సామెత అందరికి గుర్తుండే ఉంటుంది కదా. అదే ఈవిడ నైజం కూడా. చాలామంది నాకు చెప్పారు రెండో వైపు వినకుండా ఎలా అని, నిజానిజాలు తెలియకుండా నేను ఏ నిర్ణయమూ తొందరపడి తీసుకోను. అందులోనూ స్నేహం విషయంలో అస్సలు పొరపాటు చేయను. క్షమ అనే పదం కూడా ఇలాంటి వారికి వాడకూడదు. ఇంతకన్నా ఏమి చెప్పలేను. పెద్దలు, సన్నిహిత మిత్రులు, ఆత్మీయులు ఇచ్చిన సలహాలకి, నాపై చూపిన అభిమానానికి నా కృజ్ఞతలు.
నాలాంటి కొందరికి అక్షరాలే ఆయుధాలైనా ఆదరిస్తున్న ఆత్మీయుల అభిమానమే మాకు అండ. నా కబుర్లు కాకరకాయలు బ్లాగుని గత ఎనిమిదేళ్లుగా అభిమానిస్తూ, ఆదరిస్తున్న అందరికి నా కృతజ్ఞతావందనాలు. తొమ్మిదో వసంతంలోకి అడుగిడుతున్న కబుర్లు కాకరకాయలు పుట్టినరోజు సందర్భంగా నాకెంతో ఇష్టమైన స్నేహాన్ని మరో కోణంలో చూడటానికి బాధగా ఉన్నా మరికొందరు మోసపోకూడదనే ఈ పోస్ట్.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి