9, మే 2018, బుధవారం
అసత్య జీవితాలు....!!
ఎలిగాకులమైపోయామని తెలుసుకోలేకున్నాయి
ఏతావాతా మనమే గొప్పని ఎగిరెగిరి పడుతూ
బంధాలు భారమౌతున్నాయి
రక్తసంబంధాలు రోకలిపోట్లు పొడుస్తున్నాయి
అనుబంధాలో అగచాట్లో అవగతం కావడం లేదు
పురుషార్ధాలకై పాట్లు పడుతున్నాయి
పూజల పుణ్యాలన్నీ తమవేనంటున్నాయి
ఎవరికి తెలియని భాగోతాలో ఈ విషపు నైజాలవి
ఆర్తి పలుకులకు అర్ధాలు మారాయి
అభిమానం మరచిన నాటకీయతలు రాజ్యమేలుతున్నాయి
నయవంచనలో నటనా చాతుర్యాలో మరి
ఆత్మీయతలు అక్కర్లేని దౌర్భాగ్యాలైనాయి
అహంకారాలే ఆభరణాలనుకుంటున్నాయి
అటూ ఇటూ కాని అర్ధనగ్న అసత్య జీవితాలు...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి