1. మౌనానికి పర్యాయపదాలే అన్నీ_పరిభాషలెన్నున్నా పలుకు నేర్వలేక...!!
2. వర్ణమాలకెన్ని వంపులో_ఒయ్యారంగా భావాలై ఒదిగిపోతూ...!!
3. తప్పని నటనలు_నిజం కాని అనుబంధాల నడుమ...!!
4. మౌనాక్షరాలే ఆలంబన_మనసును పరిచే భావాలతో కలిసి...!!
5. పదము అప్పటిదే_దగా పడిన అక్షరానికి ఊతమై ఇప్పటికీ..!!
6. మార్పు సహజమే_ఆస్వాదన మనసుదైనప్పుడు.....!!
7. కలిసుండే ఆప్తులం మనం_కనపడని మనసుతో మాటాడుకుంటూ...!!
8. మనసు ముచ్చట్లన్నీ మనవే_మౌనానికి తావీయక...!!
9. ఆకలి నేరం కాదెప్పుడు_ఆశలే అధ:పాతాళానికి నెట్టేస్తూ...!!
10. జన్మల బంధాలై జత చేరుతున్నాయి_ఎంత పంచుకున్నా తరగలేదనేమెా....!!
11. మరలి పోయిన కాలపు గాలానికి చిక్కేవి_మలి వయసులో మధుర జ్ఞాపకాలు..!!
12. మనసుకంతా నిండుదనమే ఎప్పుడూ_అక్షయమైన అక్షర భావాలతో...!!
13. నిన్నలన్నీ నాతోనే_నువ్వు లేని వాస్తవాన్ని త్యజిస్తూ... !!
14. ఆత్మీయతలు దగ్గరైయ్యాయి_వాస్తవాలకో రూపునిస్తూ....!!
15. నిదురలోనే మెలకువ_నీలినీడలకో ఆకృుతినిచ్చే వేకువతో చేరితే...!!
16. కొన్ని కన్నీళ్ళంతే_ఆనంద విషాదాలకు నేస్తాలుగా మిగిలిపోతూ...!!
17. కొన్ని సంతోషాలంతే_విషాదాలకు విరుగుడుగా మిగులుతూ....!!
18. కొన్ని సాయంత్రాలింతే_సంద్రానికీ సందడి నేర్పేస్తూ...!!
19. కొన్ని రాతిరులంతే_రెప్పలిప్పని కలలలో దాగుండిపోతూ...!!
20. కొన్ని మౌనాలింతే_మాటలక్కర్లేకుండా మనసు తెలుపుతూ...!!
21. కొన్ని మౌనాలింతే_మాటలకందకుండా...!!
22. పలుకులన్నీ మధురాలయ్యాయి_మౌనాలద్దిన నవ్వుల్లో చేరి...!!
23. భావాలై మురిపిస్తున్నాయి_అక్షరాలకు వన్నెలద్దుతూ...!!
24. చిత్తరువు సజీవమైంది_మనసుతో గీసినందుకేమెా...!!
25. మది మౌన విపంచిగా మారింది_మరబొమ్మగా మారిన క్షణాలను తలపోస్తూ..!!
26. అలుపెరగని అల అంతరంగం_తీరాన్ని చేరాలన్న ఆరాటంతో...!!
27. అంతర్లోచనాల అవలోకనం_మనసు అవగతమైతేనే..!!
28. చిత్తరువు భావచిత్రమే_చిత్తపు రాతలకి...!!
29. రెప్పపాటు జీవితమిది_క్షణాలకు చిక్కని కాలాన్ని వెంటేసుకుని...!!
30. క్షణంలో అనంత విషాదమౌతుంది_రవ్వంత అపశృుతి దొర్లినా...!!