1. అవుననక తప్పదు మరి_మాటనో మౌనాన్నో మన్నించి...!!
2. మన్నింపు అలంకారమే మదికి_రాలిన జ్ఞాపకాల్లో మౌనం నిక్షిప్తమైతే...!!
3. అనుబంధమెప్పుడూ ఆనందమే_జ్ఞాపకాల స్పటికాలు పగలనంత వరకు..!!
4. తుడవనలవి కాని తడే_ఈ తడియారని స్వప్నాలన్నింటా ...!!
5. కలతాక్షరాలు అక్షయమైనాయి_మనసు కన్నీళ్ళలో తడుస్తూ...!!
6. మనోనేత్రం ఎర్రనైంది_గాయం జ్ఞాపకాల రుధిరాన్ని స్రవిస్తుంటే...!!
7. శిలాక్షరమై నిలిచిందో చరిత_నిలువెత్తు వ్యక్తిత్వానికి నిదర్శనంగా...!!
8. కలలో వర్షమనుకున్నా_కన్నీరొలికిందని తెలియక...!!
9. మౌనానికి మాట ఇవ్వలేను_గాయాలను పలకరించనని...!!
10. గురుతుకెలా తెలిసిందో_తన నివాసం నీలోనేనని....!!
11. మౌనం చెప్పినట్టుంది మనసుకి_గుంభనంగా జ్ఞాపకాలనుంచాలని...!!
12. అక్షరాలు కొన్నే_మనోభావాలకు అద్భుత రూపాన్నిస్తూ...!!
13. ఆత్మావలోకనంకి ఆసరా_ అవుతున్నాయి ఈ అక్షర విన్యాసాలే...!!
14. అరచేతిలో ఆకాశమే_అక్షర లక్షల ఆనందానందిస్తూ...!!
15. నీకు నాకు మధ్యన దూరమెక్కువైందట_భావాలు అలసి సోలిపోతున్నాయి...!!
16. చిరునవ్వు సౌకుమార్యమదేనేమెా_ఒంటరితనానికి ఓదార్పౌతూ...!!
17. అపహాస్యానిదే పైచేయి_మనతోనున్న అద్భుతాన్ని గుర్తెరగనీయక...!!
18. అక్షరాలు అందమైనవే_నిన్ను తమలో ఆవాహన చేసుకున్నందుకు...!!
19. కలమెులికించే సిరాదేముంది_మనసులో భావం నీవైతే....!!
20. మది రహస్యాలే స్వప్నాలై మురిపిస్తాయి_చెంత చేరక ఏడిపిస్తాయి కూడా...!!
21. భావాలెప్పుడూ అంతర్ముఖాలే_అప్పుడప్పుడూ మెరిసిపోతూ...!!
22. బంధనాలు వీగిపోతుంటాయి_ఊహకు వాస్తవానికి లంకె కుదరనప్పుడు....!!
23. బంధాలకు బాధ్యతలెక్కువ_ఊహలను వాస్తవాలు కానీయవు...!!
24. చిరునవ్వు చిరకాలముంటుంది_భావాలకు ఊతమిస్తూ...!!
25. చిందరవందరగా చుట్టుకున్నాయి భావాలు_అక్షరాల అల్లిక నుండి రాలేక...!!
26. వసంతం విలువ తెలియాలనేమెా_వత్సరానికొకటిగా బుుతువులనిస్తూ...!!
27. తప్పని నయగారాలే అవి_బందుత్వపు బందిఖానాలో...!!
28. అలక తీర్చింది భావాలే_మనసాక్షరాలను ఊరడిస్తూ...!!
29. మనసైన భావాలు చేరువనే ఉన్నాయి_అక్షరానుబంధాన్ని అంటి పెట్టుకుని....!!
30. మది అలజడికి అంతరాయమే_చిరునవ్వుల మెరుపులతో...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి