1. కన్నీరుని సైతం సిరాగా మార్చేస్తుంది_మనసు చేతిలోని కలమై...!!
2. గుండె బడబానలంలా మండుతోంది_అనుబంధాల వెన్నుపోట్లకు...!!
3. అనివార్యమైన అనుబంధమది_నాదైన ఏకాంతపు నేస్తంతో...!!
4. కన్నీరే నేస్తమయ్యింది_కలికాలం అయినందుకేమెా...!!
5. ఆగని పరుగు కాలానిదే_ఆనవాళ్ళను భవిష్యత్తుకు అందిస్తూ..!!
6. స్వప్నంలో జీవితం కనిపించింది_నిశీథిని ఎదిరించే వెలుగుల్లో...!!
7. ఆధిపత్యమెా జాడ్యం_అహమే అలంకారమనుకుంటూ....!!
8. తిరస్కరణ మనసుకి చేరదు_చూపులక్కర్లేని ఆరాధన గుండెల్లో చేరితే...!!
9. అమ్మ నేర్పిన అక్షరాలివి_ఆ ప్రేమంతా ఒలకబోయాలన్న తహతహ వాటికి..!!
10. మనసుదే అంతా_భావాలను హృదయపు సిరల్లో ముంచి రాయడంలో..!!
11. ఆశ్రయమిచ్చే అక్షరముండగా చింతెందుకు_మది భారాన్ని భావాలకందించడమే...!!
12. నవ్వులన్నీ నక్షత్రాలే_పసితనపు అమాయకత్వం చేరితే..!!
13. మౌనానికి మనసయింది_నీ ఊహలతో ఊసులాడాలని...!!
14. ఏకాంతం ఎదురుదాడి చేసింది_ఊహలు నిండిన మదిని గదమాయించేస్తూ...!!
15. గమనించే సమయమివ్వనిదే కాలం_తనతోపాటు మనల్ని లాక్కెళుతూ...!!
16. వెదకడం నీకలవాటేగా_ఎదుటనున్నా గురుతెరగక...!!
17. తరలిపోనన్నాను_వెదికి నీవలసిపోతావని..!!
18. వీడ్కోలెరుగని చెలిమి మనది_నీడలా వెన్నంటి ఉంటూ..!!
19. అక్షరాలు సేదదీరుస్తున్నాయి_మనసు మౌనాన్ని పదాలకందిస్తూ...!!
20. అవే అక్షరాలు_మనసు మర్మాలను పసిగట్టేస్తూ...!!
21. వేదనాక్షరాలు కలిపాయి ఇలా_వేసారిన మనసుకు ఓదార్పునిస్తూ..!!
22. ఊసరవెల్లి మనస్తత్వమది_కారకులెవరన్నది కనిపెట్టలేకున్నా...!!
23. ఎంత ఆరాధన నింపాలో అక్షరాల్లో_నీ మనసుకు చేరవేయడానికి..!!
24. నీ మదిలో కాస్త చోటు చాలదూ_అక్షరాలతో నే సేద దీరడానికి...!!
25. కలలాంటి కథలోనే ఓదార్పు_వెతల సంకలనాల బతుకులకు..!!
26. ఆలోచనల మార్పది_అక్షరాలవే అయినా..!!
27. తలపులే శ్వాసగా మార్చేసిన క్షణాలవి_మరెటు మరలనీయని బంధమై...!!
28. కడలే ఆదర్శమట_మదిలోని బడబానలాన్ని దాచేయడంలో...!!
29. మౌనంతో సహవాసం చేస్తున్నా_నీ మాటలు ఆలకించాలని...!!
30. అలసటే తెలియలేదు_మాటల మౌనం మధ్యన రాజ్యమేలుతుంటే..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి