28, ఫిబ్రవరి 2020, శుక్రవారం
వైల్డ్ కార్డ్...!!
27, ఫిబ్రవరి 2020, గురువారం
ఎవరి పక్షం..!!
26, ఫిబ్రవరి 2020, బుధవారం
రాతలు.. !!
25, ఫిబ్రవరి 2020, మంగళవారం
త్రిపదలు..!!
23, ఫిబ్రవరి 2020, ఆదివారం
రాచమర్యాదలెవరికో...!!
అభివృద్ధి..!!
16, ఫిబ్రవరి 2020, ఆదివారం
తెలుగుకే తెలుగు అనువాదం ఏంటో..!!
12, ఫిబ్రవరి 2020, బుధవారం
చచ్చిపోయిన సమాజం...!!
11, ఫిబ్రవరి 2020, మంగళవారం
నేను నా అక్షరాలు..!!
9, ఫిబ్రవరి 2020, ఆదివారం
అపసవ్యం..!!
8, ఫిబ్రవరి 2020, శనివారం
వివాదాస్పదమౌతున్న నేటి సినిమా పాటలు..!!
7, ఫిబ్రవరి 2020, శుక్రవారం
ఏక్ తారలు..!!
5, ఫిబ్రవరి 2020, బుధవారం
సమయం అందరిది..!!
4, ఫిబ్రవరి 2020, మంగళవారం
రాజసూ(కీ)య యాగం..!!
3, ఫిబ్రవరి 2020, సోమవారం
జీవన 'మంజూ'ష (ఫిబ్రవరిె 2020 )
నేస్తం,
పిలుపులకు, పలుకులకు సంబంధం లేకుండా పోతోంది. ఎంతయినా నాభి నుండి వచ్చే పిలుపులకు, నాలుక మీది పలుకులకు తేడా తెలుసుకోలేక పోవడం కాస్త దురదృష్టమనే చెప్పాల్సి వస్తోంది కొందరి ప్రవర్తన చూసిన తర్వాత. అభిమానాన్ని ఆసరా చేసుకుని పబ్బం గడుపుకునే వారు కోకొల్లలు మన సమాజంలో.
అమ్మ, అక్క, చెల్లి అంటూనే అడ్డమైన వాగుడు వాగేవారు బోలెడుమంది. కనీసం ఎదుటివారి వయసు కూడా గుర్తురాదు వీళ్ళకు. మన భారతీయ సంస్కృతిలో కుటుంబ విలువలకు అగ్రస్థానం ఒకప్పుడు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతూ వ్యక్తిత్వ విలువలకు తిలోదకాలిస్తూ ఆధునికత మెాజులో పడి పెడదారులు పడుతున్న సమాజం నేడు. పరాయి సంస్కృతిని వంటబట్టించుకునే ముందు మనమెక్కడున్నాం, మనమేంటి అన్నది తెలుసుకోవాలి. స్వేచ్ఛకు, విచ్చలవిడితనానికి తేడా తెలుసుకోవాలి. విశృంఖలత్వానికి స్నేహమనే ముసుగు వేసేసి చేతులు దులిపేసుకోవడం సమంజసం కాదు.
ఇంటి మనుషులకు విలువ ఇవ్వని ఎవరూ ప్రపంచంలో బాగు పడిన దాఖలాలు లేవు. ఇంటి బాధ్యతలు, ఇంటిలోని వారికి విలువ ఇవ్వని చదువు, సంస్కారం ఈనాడు గొప్పదని కొందరనుకుంటున్నారు. అక్కరకు రాని బంధుత్వాలే అన్నీ ఈనాడు. రక్త సంబంధాలు రాలిపోతున్న ఆనవాళ్ళే అయిపోతున్నాయి.
భాషా సంస్కృతులు మన ఉనికికి పట్టుగొమ్మలు. మనమే చీడపురుగుల్లా చేరి పచ్చని చెట్టు వినాశనానికి దోహదం చేస్తున్నాం. మరోపక్క సభ్య సమాజ అభ్యుదయం కావాలంటున్నాం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని మర్చిపోతున్నాం. అందరం సమాజం బాగుపడాలనే అంటాం కాని, సమాజమంటే మనమేనని మర్చిపోతున్నాం. మనం మేల్కొన్న రోజే సమాజ పురోభివృద్ధి. ఎంత త్వరగా మనం మేల్కొంటే అంత త్వరగా మన తరువాతి తరాలకు చక్కని కుటుంబ అనుబంధాలను, వ్యక్తిత్వ విలువలను ఇస్తూ, ఉన్నతమైన మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కానుకలుగా అందించగలుగుతాం.
2, ఫిబ్రవరి 2020, ఆదివారం
మడిపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి...!!
బ్రహ్మాండమంత విశ్వంలో అణువంత అక్షరం సృష్టించే విస్ఫోటనం ఏంటో అక్షరం విలువ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడు తమ భావాలు పదిమందికి చేరాలంటే ముద్రితాక్షరాలై ఉండాలి. ఇప్పుడు మనకు క్షణాల్లో మన భావాలు ప్రపంచాన్ని చుట్టి వస్తాయి. ఆ వెసులుబాటు సాంకేతికత కల్పించింది. కావ్యాలు, పద్యాలు, దీర్ఘ కావ్యాలు, కవితలు, కథలు, వ్యాసాలు, నవలలు ఇలా అన్ని ప్రక్రియలు ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి మన తెలుగు సాహిత్యంలో. ఆ కోవలోకే ఇప్పుడు పలు లఘు కవితా భావ ప్రక్రియలు ప్రాచుర్యం పొందుతున్నాయి. అనల్ప పదాలలో అంతులేని భావాలను పొదగడంలో చాలా నేర్పు, ఓర్పు అవసరం. ఆ నేర్పును, ఓర్పును అలవోకగా అందుకున్న అతి కొద్దిమందిలో మడిపల్లి వెంకటేశ్వరరావు గారు ఒకరు. నిగర్వి, ముక్కుసూటితనం, దేనికి ఎవరికి భయపడని తత్వం, సమాజం పట్ల తన వంతుగా ఏదైనా చేయాలన్న తపన, అన్యాయాలను, అక్రమాలను నిరసించే గళం ఇలా ఎన్నో బాధ్యతలను తానుగా నిర్వహిస్తూ, సమాజ హితం కోసం అక్షర శరాలను సూటిగా ఎక్కుపెట్టి చదువరుల మనసు లోతులను తడిమే అక్షర ఆంతరంగికుడు మడిపల్లి వెంకటేశ్వరరావు గారు.
తాను చెప్పాలనుకున్న విషయం సామాజికమైనా, ఆర్ధికపరమైనదైనా, రాజకీయమైనా నిష్పక్షపాతంగా, స్పష్టంగా చెప్పడం, అధికార పక్షం, ప్రతిపక్షం కాకుండా ప్రజల పక్షాన తన అక్షర శరాలను సంధించడం ఈయన ప్రత్యేక లక్షణం. రైతుకు ప్రభుత్వం ఇచ్చే నష్టం పంటకా..? పోయిన ప్రాణానికా..? అన్న ప్రశ్నఎవరైనా ఇప్పటి వరకు వేసారా..? మడిపల్లి వెంకటేశ్వరరావు గారు మాత్రమే అడగగలిగారు. ఈ ఒక్క మాటలోనే ఆయన వ్యక్తిత్వం తెలుస్తోంది. పుణ్యానికి కొలమానాలు ఏమిటని మరొక మాట అడుగుతారు ఇలా..
" చేసేది పాపపట
వేసేది ముస్టట
వచ్చేది పుణ్యమట.. నిజమేనా..!! " ఎవరు సమాధానం చెప్పగలరు ఇలాంటి ప్రశ్నలకి.
మాతృభాషను కాదని ఆంగ్ల భాషను, అధికార భాషను అభివృద్ధి చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. కుల, మత వివక్షలకు సూటిగానే చురకలు అంటించారు. కలం విలువ, కలం విలువ తెలిసిన మనిషిగా
" కలం కథానికగా మారింది
కలం విలువ తెలిసిన కథకుడి చేతిలో.. " అంటూ చక్కని భావాన్ని అందించారు.
మరో చోట నిజంలో జీవిస్తూనే అబద్ధంలో బతికేస్తున్నామన్న జీవిత సత్యాన్ని ఎంత సుళువుగా చెప్పేసారో.
అనుబంధాల్లో నటనలు, మోసాలు, ఆనందాన్ని, కోపాన్ని, వేదనను, స్నేహాన్ని, ద్వేషాన్ని ఇలా ప్రతి అనుభూతిని చిన్న చిన్న వాక్యాల్లో చదివే వారి మనసులోనికి దూసుకుపోటట్లుగా రాయగలగడం ఓ కళ. బాధను ఒకేలా అనుభవించగలగడం స్థితప్రజ్ఞతగా తాత్విక భావాన్ని చెప్తారు. ఓ మనిషిలో మంచిని, మానవత్వాన్ని ఆ మనిషి పోయాకే మహాత్మునిగా గుర్తిస్తారని ఇప్పటి జనం తీరును చమత్కరిస్తారు. సమాజంలో మంచి మార్పు కోరేవాడు ఎప్పుడు సమాజానికి శత్రువేనంటారు. మనం అనుభవించే సుఖాలు మరొకరి కష్ట ఫలితమే అని ఎందుకు గుర్తించమో అని ఒకింత బాధను వ్యక్తపరుస్తారు. రాజకీయ మాయలో ప్రజానాయకుడెవరో, సేవకుడెవరో అన్న సంశయాన్ని రేకెత్తిస్తారు. ఆట ఏదైనా, రాజకీయమైనా గెలుపు నిజాయితీగా ఉండాలంటారు.
" కలం నాదే
సిరానే నాదికాదు
చేయి నాదే
రాతే నాది కాదు.." అంటూ మనసు రాసే రాతలే తనవని స్పష్టం చేసారీ సమాజ హితుడు, అక్షర సన్నిహితుడు మడిపల్లి వెంకటేశ్వరరావు. సమాజంలో లోపాలను సరిచేయడానికి అక్షర ఆయుధాలను సిద్ధం చేసుకుని సాహిత్య యుద్ధభూమికి అడుగిడి, అలతి పదాలతో అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తూ, బాధ్యతాయుత రచనలను అందిస్తున్న అక్షర శ్రామికుడు మడిపల్లి వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు. వీరి సాహితీ శర పరంపర నిత్యం కొనసాగాలని కోరుకుంటూ.... శుభాభినందనలు.
ఈమని శ్రీసత్య సాంబశివరావు గారి గురించి...!!
ఏ అధికార హోదా, సాహిత్యపు పెద్దల వెన్నుదన్ను లేని ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చిన, సామాజిక బాధ్యత గలిగిన కవి, రచయితకు గుర్తింపు రావడమంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఎన్నో అడ్డంకులను, అవరోధాలను ఎదుర్కొంటూ, కుటుంబ,ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ, రచనల్లో తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న అతి సామాన్యులుగా ఉండే అసామాన్యులు ఈమని శ్రీసత్య సాంబశివరావు గారిని గౌరవ డాక్టరేట్ వరించడం, అదీ సాహిత్యంలో సేవలకు లభించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ మరియు అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్కృత సంస్థ సెప్టెంబర్ 27న దుబాయిలో ప్రముఖ హోటల్ ఆర్కిడ్ వ్యూ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన అవార్డ్ ఫంక్షన్ లో సాహిత్య, సంస్కృత సేవలకు గుర్తింపునిచ్చి పలువురు ప్రముఖుల సమక్షంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం తెలుగువారిగా మనము గర్వించదగ్గ విషయం. ఈమని శ్రీసత్య సాంబశివరావు గారి సాహితీ ప్రస్థానం వెనుక ఎంతో కఠోరశ్రమ ఉంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి అక్షరం మీద మమకారాన్ని, సమాజానికి తనవంతుగా సేవ చేయాలన్న తలంపుతో మొదలుబెట్టిన సాహిత్యం ఈరోజు గౌరవ డాక్టరేట్ అందించి వారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. సమాజం మనకేమిచింది అని కాకుండా సమాజానికి మనమేం చేశామన్న ఆలోచనే ఈ పురస్కారానికి కారణం అయ్యింది. నిత్య సాహితీ సేవకులు ఈమని శ్రీసత్య సాంబశివరావు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనల శుభాకాంక్షలు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంకి 15 కి మీ దూరంలో గల భోగిరెడ్డిపల్లి అన్న చిన్న పల్లెటూరు నుంచి పేదరిక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన సామాజిక కవి ఈమని శ్రీసత్య సాంబశివరావు గారి గురించి నాలుగు మాటలు చెప్పడానికి ముందు వారు కవిత్వం రాయడం ఎప్పుడు, ఎలా మొదలైందో చెప్పాలి. కవిత్వం రాయడం అనేది దేవుడిచ్చిన ఒక వరం. చిన్నప్పటి నుండి పేదరికపు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబపు బరువు, బాధ్యతలు ఎలా ఉంటాయో కళ్లారా చూసిన వ్యక్తి తన మనసులో కలిగిన భావాలకు అక్షర రూపం ఇవ్వడం అనేది, అది ఏ సాహిత్యపు వాసనలు లేని ఒక కుటుంబం నుండి రావడమన్నది చాలా అరుదైన విషయం. చిన్నప్పటి నుండి చదువులో ముందుంటు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తొమ్మిదవ తరగతిలోనే కవిత రాయడం ఆ రోజుల్లో చాలా అరుదు. ప్రముఖ కవయిత్రి డా. మంగళగిరి ప్రమీలాదేవి, మరో ప్రముఖ కవి అందరికి సుపరిచితులు రావి రంగారావు గారి శిష్యు. డినని సవినయంగా చెప్పుకుంటూ, శ్రీ శ్రీ కళా వేదిక తెలంగాణకు సహాయ కార్యదర్శిగా గురుతర బాధ్యతలను నెరవేర్చుతున్న అసాధారణ వ్యక్తి ఈమని శ్రీసత్య సాంబశివరావు. ఇప్పటి వరకు 800 పై చిలుకు కవితలు, 50 పైగా వ్యాసాలు ఈమని కలం పేరుతో రాశారు. 30 పైగా కవితలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
వీరి కవిత్వంలో ఎక్కువగా సమాజ అసమానతలను ప్రశ్నిస్తూ, ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. సగటు మనిషి కష్టాలను, కన్నీళ్లను, ఆవేదనను, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎత్తి చూపడం, అనాధలకు, బడుగు బలహీన వర్గాలకు ఉంటూ, న్యాయం కోసం కోసం పోరాడటమే తన కవితల లక్ష్యం అంటున్నారు. భవిష్యత్ తరాలకు వారధిగా తన భావాలను అమర్చుతాననడం సమాజం పట్ల ఈయనకున్న నిబద్ధతను తెలియజేస్తోంది.
వీరి కవితలు కొన్ని పరిశీలిస్తే వాటిలో దాగిన సమాజ హితం, సంస్కృతుల పట్ల తనకున్న ఇష్టం తెలుస్తుంది. సగటు మనిషి సవ్వడి కవితలో సగ్గటు మనిషి ఆంతర్యాన్ని చక్కగా వినిపిస్తారు. ప్రశ్నలు, సమాధానాలు, న్యాయాన్యాయాలు, అవకతవకలు ఇలా ప్రతి విషయాన్నీ విప్పి చెప్తారు. తన భావాల్లో అప్పుడప్పుడు కాస్త తాత్వికత కూడా చోటు చేసుకోవడం గమనార్హం. తాను పనిచేసే మెడికల్ సంస్థలకు కూడా న్యాయం చేసే ఉద్దేశ్యంతో ప్రజలకు ఆరోగ్య విషయాలను చక్కని వ్యాసాల ద్వారా పలు వార్తా పత్రికల్లో ప్రచురించారు. అమ్మ లేని లోటుని, రాజకీయ అసమానతలను, కష్టాలకు ఓదార్పుగా ఆశావహ దృక్పథాన్ని, తొందరపడి ప్రేమలో మోసపోతే ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇలా తన ప్రతి ఆలోచనకు చక్కని అక్షర రూపాన్ని అందించడంలో కృతకృత్యులయ్యారు. రాజకీయ, సామాజిక అంశాలతోపాటుగా, ప్రేమ, వేదన, ఆశలు, ఆశయాలు మొదలైన భావాలను తన కవితల్లో పంచుకున్నారు. ఈ తరం నుండి తరువాతి తరాలకు పది కాలాలు మంచి సాహిత్యం, మానవత్వపు విలువలు అందించాలన్న ఈమని గారి కోరిక నెరవేరాలని కోరుకుంటూ, మరిన్ని రచనలు ఈయన కలం నుండి వెలువడాలని ఆశిస్తూ ... హృదయపూర్వక అభినందనలు..