15, జూన్ 2021, మంగళవారం
ఏక్ తారలు.. !!
1. అందంగా వికసించిన వాస్తవం_గతపు ముళ్ళ గాయాల నుండి...!!
2. అసాధ్యమేమెా_అలవికాని ఆ పాత మధురాల నుండి బయట పడటం...!!
3. మనసుని తట్టి లేపాయనుకుంటా ఆ క్షణాలు_భారాన్ని కాస్తయినా పంచుకుందామని...!!
4. మనసునోదార్చే ముత్యాలే అవి_గాయపు ఛాయలకు లేపనాలుగా...!!
5. పేర్చుకుంటూ పోతానలా అక్షరాల్ని_పెంచుకున్న పాశాలకు సాక్ష్యాలుగా...!!
6. మాటలే మంత్రాలయ్యాయి_ఓదార్పు అక్షరం అయినప్పుడు..!!
7. అక్షర సంద్రపు ఆంతరంగికమిది_తీరని ఆవేదనకు తీరముగా..!!
8. మౌనాన్ని తేటతెల్లం చేసేస్తుంటాయి_అక్షరాలకు అలవాటైన విద్య మరి...!!
9. చతురత అక్షరాలదే_వి(స)న్యాసమైనా..!!
10. మరచిపోని గతము తానైంది_మరపు తెలియని మనసుల మధ్యన..!!
11. పంచుకుంటూ పోతానిలా_తెంచుకోవడం తెలియక..!!
12. మనసు పరిచే సంవేదనలివి_మౌనాలకనుగుణంగా అక్షరాలేరుకుంటూ..!!
13. లెక్కకు రానివే తడిసిన చెక్కిళ్లు_మాట రాని మౌనం మనసుదయ్యాక..!!
14. లెక్కలకందనివే ఈ అక్షరాంగనలు_మనసులను సమ్మెాహనం చేసేస్తూ...!!
15. అంతర్వాహిని అంతరంగం_అనంతాన్ని తనలో దాచేస్తూ...!!
16. అమ్మ చేయాల్సిన రాజీనామా_మర్చిపోయిందనుకుంటా ఈ జన్మకు..!!
17. పలవరింతే తానెప్పుడూ_మనసు ముడిగానో మౌన జ్ఞాపకంగానో..!!
18. ఆగని పయనమిది_అలుపు లేని అక్షరం సాక్షిగా...!!
19. అమ్మంతే_ఓడిపోతున్నా గెలుపు తనదేనని మురిసిపోయేంత అమాయకత్వంతో...!!
20. మరో అధ్యాయానికి నాందీ వచనమే_ముగింపు ముంగిలి ముందున్నా..!!
21. చెలిమి చెంతనే ఉంది_చీకటి కన్నీరు చెరిపేయడానికి..!!
22. అద్భుతాల అవసరమే లేదు_మనసైన స్నేహం మనదైతే చాలుగా...!!
23. అంతర్ముఖీనత అనివార్యమైంది_అంతరంగ అంతర్లోచనావిష్కరణకు...!!
24. అవసరానికి అందరు కానివారే_చుట్టరికం దుడ్లకే పరిమితమౌతూ...!!
25. అహంకారం అదిలించింది_గాయం మౌనంగా భరిస్తూ ఉండిపోతోంది..!!
26. పసితనపు ఆనవాళ్ళవి_పండు వయసులోనూ ఊపిరౌతూ..!!
27. మరుపు తప్పనిసరైంది_ఆకారాలు ఉనికి కోల్పోయాక..!!
28. నేనొక సజీవ సాక్ష్యాన్ని_గతకాలం చెక్కిన సమాధిపై..!!
29. అనుభవమై అలరాలుతున్నా_అక్షరాలు అక్కున చేర్చుకుంటున్నాయని...!!
30. కొన్ని మనసులోనికి చొప్పించాలి తప్పదు_కాలం చెప్పే తీర్పుని వినాలంటే...!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి