24, జులై 2021, శనివారం
ఏక్ తారలు..!!
1. గుర్తు చేసుకోవడానికి నువ్వేమన్నా జ్ఞాపకానివా_జీవితమైతేనూ..!!
2. భాషణం భూషణమైంది_మౌనం మనసైనదైనప్పుడు..!!
3. నీ నా తారతమ్యమెందుకు_మౌనాక్షరాలు మన మధ్య బంధమైనప్పుడు..!!
4. ఆత్మీయతలున్న చోట అస్తిత్వమెందుకు?_మనమన్న మమతలు చాలుగా...!!
5. దాచినా దాగదు మనసు_అక్షరాల్లో గతాన్ని వల్లెవేస్తూ...!!
6. కాలానికి మనతో పని లేదు_బాధల గాథలను వెంటేసుకు పోతుందంతే...!!
7. వినాలి గాని కలత కబురులెన్నో చెబుతుంది_మనసు తెలిసిన మార్మిక నేస్తమై...!!
8. అద్భుతమే నాకెప్పుడూ_అనంత శూన్యాన్ని అక్షరాలకెలా అందిస్తారా అని..!!
9. విప్పి చెప్పలేని వ్యధలు కొన్ని_మనసుని గదమాయిస్తూ...!!
10. మానసిక ధైర్యం అవసరమే_మౌనం వీడి మాటలతో సమాధానం చెప్పాలంటే..!!
11. మనసు కన్నీళ్ళవి_అక్షర జలపాతాలై అవిష్క్రతమౌతూ..!!
12. మాటను దాచేసింది మౌనం_అక్షరాల్లో మనసును కనబడనీయక...!!
13. పన్నీరుగా మారాలన్న ఆకాంక్ష చెలిమిది_కన్నీటి మూల్యమెరిగినది కనుక...!!
14. కొన్ని కన్నీళ్ళంతే_మనసు భారాన్ని కడిగేస్తూ..!!
15. వాస్తవమెుక నిజమే_భవిష్యత్తుకు జాగురూకత నేర్పుతూ..!!
16. ఇవ్వద్దనుకుంటూనే ఇచ్చేసా_తిరిగి ఇవ్వలేవని తెలిసీ..!!
17. సిరా చుక్క ఒలికింది_మనసు కన్నీళ్ళు తనలో కలిసాయని..!!
18. అక్షరాలోచనకు అంకురార్పణ జరిగింది_ఓరిమి వహించిన మనసులో..!!
19. నీకనే ఇచ్చాను_మరచిపోతావని తెలియక..!!
20. శాపమూ వరమైందిలా_కలల చుక్కలకు కల'వరమై..!!
21. బలహీనత మనసుదే_కాలం నేర్పిన విద్యను గ్రహించలేక..!!
22. అలుపెరగని పయనమే ఇది_అక్షరాలకు అంకితమయ్యాక..!!
23. మనసులోని మౌనానికెప్పుడూ మాటలే_నీకు వినబడాలన్నంత ఆరాటంతో..!!
24. మాటల అల్లరి నీతోనే ఉందిగా_మౌనలిపితో పనేముందిక..!!
25. జీవితపు ఆటుపోట్లు తప్పనిసరి_కాలమాగినట్లు మనకనిపించినా..!!
26. ఓటమి చప్పుడు వింటున్నా_గెలుపు పిలుపుని ఆహ్వానించడానికి..!!
27. శిథిలాలు సాక్ష్యాలుగా కనబడుతూనే ఉన్నాయి_మనసు కార్చిన మౌనకన్నీటికి...!!
28. మనసు చెమ్మ మౌనం వీడింది_గాయాల గురుతులతో అక్షరాలను అలంకరిస్తూ..!!
29. ఎగిసిపడే అలలెన్నో_తీరం చేరని జీవితాల్లా..!!
30. ఎగిరే ఆశలే అన్నీ_పెనుగాలికి చెల్లాచెదురౌతూ..!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి