అది కాదురా అబ్బాయ్,
మనకి తెలిసిన వాళ్ళని మనముదాహరించినట్లే వాళ్ళకి తెలిసిన వాళ్ళని వాళ్ళు ఉదాహారిస్తారు. దీనిలో ఆక్షేపణలెందుకు?
నీకు నచ్చిన వాళ్ళు బాగా గొప్పోరు కదా. మరలాగే వారికి నచ్చిన వారిని వారు గొప్పగా చెప్తారు. కులమతాల హేళనలు మన చెవులకు ఇంపుగా, చూడటానికి అందంగా అగుపడతాయి కదా! అందుకే మనకి వాటిలో అన్ని కళలు గొప్పగానే కనబడతాయి.
అందుకే మాటలకు, రాతలకు ముందు కాస్త ఆలోచన చెయ్యాలి. మంచి మాట తరాల తరాల నుండి కొత్త తరాలకు చేరవేయడం తప్పేం కాదు. మనిషున్నా లేకున్నా మాట వుండిపోతుంది అని మన పెద్దలు ఎప్పుడోనే చెప్పారు కదా! గుర్తు లేదా!
అయినా మానవీయం, అమానవీయం మనకెందుకు? మనం చేసిన పనులు మనం చెప్పకుంటే బాగోదురా అబ్బాయ్!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి