1. దీర్ఘదృష్టి
బావుంది
హ్రస్వదృష్టే
అనడం లేదు
దూరానిదెప్పుడూ
దగ్గరతనమే..!!
2. కట్టె
కాలాలి
కట్టెలు
కావాలి
కాపీనం
కాయానికి..!!
3. తరుగు
బంగారానికే కాదు
బంధాలకు
పాకింది
విలువల
తూకమే..!!
4. Attachment
Detachment
Heart and
Soul
Unconditional
Love..!!
5. విసుక్కోవడం
పరిపాటి
వీడిపోవడం
స్వయంకృతం
సంయమనం
సరైనది..!!
6. కొన్ని
పరిచయాలు
ఆత్మీయ
అనుబంధాలు
దూరాల
కొలమానం అక్కర్లేదు..!!
7. నమ్మకం
బలమైనది
నిజాయితీ
విలువైనది
కోల్పోతోంది
మనిషితనం..!!
8. తింటే
తిన్నామంటారు
తినకపోతే
తినలేదంటారు
రెండు నాల్కల
ధోరణి..!!
9. బుద్ధుడిది
బోధివృక్షం
రుద్రుడిది
రుద్రభూమి
సిద్ధాంతం
ఎవరిది వారిదే..!!
9. మాట
పొదుపు
నోరు
అదుపు
క్రమశిక్షణా
రాహిత్యం..!!
10. చెప్పే స్థాయి
కొందరిది
చెప్పించుకునే స్థితి
మరికొందరిది
మనిషికి
కాలానికి సంఘర్షణ..!!
11. గుర్తింపు
కావాలి
ఆధిపత్యపు
చరిత్ర
లిఖించేయడమే
తరువాయి..!!
12. రాతల్లో
బ్రహ్మరథాలు
వడ్డించేది
మనవాడే
పుస్తకానికో
పురస్కారం..!!
13. ఆరుపదుల ప్రేమ
ఉప్పొంగి పోతోంది
తినడమే తెలిసిన
బతుకులు కొన్ని
ఒక్క దీపమైనా
ఎరుగని స్మృతి శకలాలు..!!
14. చాతకానప్పుడు
ఊరుకోవాలి
నెపం
వేయకూడదు
అన్నీ బావుంటే
మన ప్రతిభే..!!
15. అతుకులూడిన
అనుబంధాలు
మెతుకుల లెక్కల
బతుకులు
కొడిగట్టిన
దీపం..!!
16. అన్నీ
శేషాలే
అవశేషాల
లెక్కలు తేలక
జీవితం
యంత్రాల యాంత్రికతలో..!!
17. ఆశ
అధఃపాతాళం
కోరిక
కొసమెరుపు
ఏ రాతలో
ఏముందో..!!
18. గాలి
ఎవరో
ఘనాపాటి
ఎవరో
మనస్సాక్షికి
తెలుసు..!!
19. కత్తిరింపులు
తెలియకూడదు
పలకరింపులు
సున్నితంగా వుండాలి
వాటంలో
నేర్పు..!!
20. కొత్తగా తెలియాల్సినది
ఏముంది?
పరిచయం
పాతదే కదా!
ఋణానుబంధం
ఎప్పటిదో..!!
21. కోరికల
ప్రవాహం
ఆలోచనలకు
అడ్డేముంది
మది
పున్నమి సంద్రం..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి