12, ఏప్రిల్ 2011, మంగళవారం

నిజానిజాలు ఏంటో మరి....??

పరిటాల రవి చని పోయిన ఇన్ని రోజులకు నువ్వు చంపావు అంటే నువ్వు చంపావు అని ముఖాముఖి లో కొట్టుకుంటున్నారు అందరూ....పరిటాల రవిని ఎవరు చంపారు అన్నది జగమెరిగిన సత్యం. సరే అది పక్కన పెడితే జగన్ అని కాంగ్రెస్ వర్గాలు ముక్త కంఠంతో హోరెత్తుతున్నాయి ఈ రోజు...మరి చంపిన రోజు ఎందుకు చెప్పలేదు ఈ నాయకులు అందరూ...ఆ రోజు వాళ్ళు వాళ్ళు చుట్టాలు...మరి ఇప్పుడు వేరు కుంపట్లు కనుక ఇంతకు బేరం కుదుర్చుకుని ఇలా ప్లాన్ వేసి చంపించాడు జగన్ అని చెప్తున్నారు. మరి ఈ నిజాయితీ ఆ రోజేమయ్యిందో!! మన నాయకుల నిజాయితీ ఎంతో మనకు బాగా తెలుసు. ఎన్నో సంఘటనలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.....ఒక ఆయేషా, ఒక శ్రీలక్ష్మి, చిన్నారి వైష్టవి, ఓ సత్యంబాబు......ఇలా ఎందరో నాయకుల అధికారానికి, ఇనుప కాళ్ళకు బలి అవుతున్నారు.
మొద్దుశీనుని చంపి ముందు టి వి లో అది ఆత్మహత్య అన్నారు అది హత్య అని చిన్న పిల్లాడికి కుడా తెలుస్తుంటే ఇక వేరే దారి లేక హత్య అని ఒప్పుకున్నారు. సూరిని వై ఎస్ ఆర్ ఉన్నప్పుడే వదిలేయాలని చూసారు, కాని విమర్శలకు తట్టుకోలేక సూరి విడుదలను వాయిదా వేసారు. మొత్తానికి సత్ప్రవర్తన అన్న పేరుతొ వదిలేసారు కాకపొతే చావుని ఆపలేకపోయారు. లేకపోతె ఈ సరికి ఇంకో రాజకీయ నాయకుడు జగన్ కి తోడు ఉండేవాడు.
జనానికి ఈ రాజకీయాలు అర్ధమై ఎవడిని నమ్మాలో ఎవడిని నమ్మకకూడదో ఇప్పుడు బాగా తెలుసు. ఈ పనికిమాలిన చర్చలు మానేసి టి వి మీడియా వాళ్ళు జనానికి పనికివచ్చే చర్చలు పెట్టి కొన్ని సమస్యలకయినా పరిష్కారం చూపిస్తే బావుంటుంది. వాడంత తిన్నాడు...వీడింత తిన్నాడు...వాడు వాడిని చంపాడు...ఇలాంటి చెత్త చర్చలు మాని మీడియా గౌరవం పెంచే చర్చలు చేస్తే ఎంతో మేలు.

మనస్సాక్షిని అడగండి...!!

ఈ టపా రాయొద్దనే అనుకున్నాను....కాని రాస్తున్నాను. నాకెంతో ఇష్టమైన ఈ టి వి లోని పాడుతా తీయగా... నిన్నటి ప్రోగ్రాం గురించి...ఎంతమంది చూసారో నాకు తెలియదు కాని తప్పులు పాడినా కుడా ఎనభై పైన మార్కులు ఇచ్చి ట్యూన్ అంతా చక్కగా పాడావు అంతా బావుంది అని ఎన్ని మార్కులు ఇచ్చారో బాలు గారు అందరూ చూసే వుంటారు. బాలు గారు కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి చూడండి మీరు చేసిన పని గురించి. బాలు గారిని విమరర్శించేంత పాండిత్యం నాకు లేదు, అలా అని తప్పుని చూస్తూ ఊరుకోలేక ఈ టపా!! కొంతమంది నా అభిప్రాయాన్ని అదే నిజం అని అనుకుంటున్నానని అంటున్నారు. నేను ఈ ప్రోగ్రాం గురించి రాసిన టపాల్లో నిజమెంతో ప్రోగ్రాం చూసిన వాళ్లకు తెలుస్తుంది. నాకు బాలు గారంటే చాలా ప్రత్యేకమైన అభిమానం. ఆయనని తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు....మిగతా అన్ని ప్రోగ్రామ్స్ లానే ఇది కుడా కలుషితమైపోతోందే అని నా బాధ అంతే. బాలు గారు బాగా జడ్జ్ చేస్తారు అనుకున్నాను కాని పక్షపాతం చూపిస్తారు అనుకోలేదు ....చాలా బాధగా వుంది....ప్రతిభకు న్యాయం జరగటం లేదని....!!

11, ఏప్రిల్ 2011, సోమవారం

నమ్మకాన్ని పాడుచేసుకోకండి బాలు గారు......

క్రిందటి సోమవారం ఈ టి వి లోని పాడుతా తీయగా ఎపిసోడ్ మొత్తం చూడలేదు ఆ రోజు....కాని నిన్న మొదటి రౌండ్, రెండో రౌండ్ చూసాక బాలు గారు మార్కులు ఎందుకు తక్కువ వేసారో అర్ధం ఐంది. ట్యూన్ లో తప్పులేకుండా పాడినందుకు ఏభైఆరు శాతం వేసారు...పాడేటప్పుడు గాలిని కుడా వినిపిస్తున్నందుకు మొదటి స్థానం ఇచ్చారు. ఎంత బాగా జడ్జ్ చేస్తున్నారో బాలు గారు.....ఎందుకండీ అలాంటప్పుడు పోటిలని ప్రోగ్రాములు పెట్టడం? మీకు ఇష్టమైన నలుగురిని పిలిచి బహుమతులు ఇవ్వండి సరిపోతుంది. అంతకు ముందు మంచి పాటలు పాడటం లేదని మార్కులు ఇవ్వలేదు....ఇప్పుడు ఫీల్ లేకుండా అని ఇవ్వలేదు...పాటలు బాగా పాడే వాళ్ళు ఎవరైనా ఫీల్ తోనే పాడతారు అది బాలు గారికి బాగా తెలుసు. అర్ధవంతమైన తప్పులు చెప్పండి అవి వాళ్ళ భవిష్య సోపానానికి పునాది అవుతాయి, కాని ఇలా మీ మీద వున్న నమ్మకాన్ని పాడుచేసుకోకండి బాలు గారు......

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

జీవితం - ఆట

ఆటలో గెలవాలనే ప్రతి ఒక్కరు అనుకుంటారు...కాని ఒక్కోసారి...... ఓడిపోతువుంటారు. మనం ఆడే ప్రతి ఆటలో గెలుపోటములు సహజమే. దైవం మనతో ఆడే ఆటలో కుడా అంతే. గెలుపు ఇచ్చినంత ఆనందం(కిక్) ఓటమి ఇవ్వదు. అలా అని ఆడిన ప్రతిసారి... ప్రతి ఆటలోనూ విజేతలం మనమే కాలేము. ఒక్కసారి గెలిచామని ఇంక ఆడకుండాను ఉండలేము అలా అని ఓడిపోతూనే ఉండము ప్రతిసారి.....ఓడిన ప్రతిసారి మరోసారి గెలవాలన్న తపన, కసి, పట్టుదల పెరగాలి. ఆట అయిపొయింది మనం గెలవలేకపోయామే అనుకోకూడదు....జీవితం కుడా అంతే...సమస్య వచ్చినప్పుడు అయ్యో ఎంత పెద్ద కష్టం వచ్చింది అని బాధ పడుతూవుంటే సరిపోదు దానికి ఏదోఒక ప్రత్యామ్నాయం చూడాలి. జీవితమంతా ఎప్పుడూ కస్టాలు వుండవు అలా అని సంతోషము వుండదు, రెండూ వుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ..ఒకరికి ఉద్యోగం లో సమస్య, మరొకరికి ఇంట్లో, వేరొకరికి డబ్బుల ఇబ్బంది...ఇలా రకరకాల సమస్యలు వుంటాయి. మనం భయపడితే ఇంకా భయపెడతాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే......ఎగసిపడే ప్రతి అల విరిగి పడుతుంది....పడిపోయాను కదా అని మళ్ళి ఎగసిపడటం మానదు కదా!! ఇంకా పైకెగరాలని చూస్తుంది....అది ప్రకృతి సహజం. పడిపోతామని పరిగెట్టడం కాని...నడవటం కాని మానేస్తే అస్సలు చేరాల్సిన గమ్యస్థానం దూరం తరిగి పోదు. ప్రయత్నలోపం లేకుండా మనం కోరుకున్న సంకల్పం కోసం శ్రమిస్తే తప్పక ఫలిస్తుంది...ఎన్ని అవరోధాలు ఎదురైనా మన అడుగు ముందుకే పడాలి, వెనుకంజ ఉండకూడదు....ఎన్నోసార్లు తన ప్రయోగాలు విఫలమైనా నిరాశ చెందకుండా థామస్ ఆల్వా ఎడిసన్ మనకు ఎన్ని అందించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి...ఎందరి శ్రమకు ఫలితమో ఈనాడు మనం అనుభవిస్తున్న స్వరాజ్యం....ఈ సుఖభోగాలు....యోగాలు....!! కలలు కనడం తప్పు కాదు వాటిని నిజం చేసుకోవడానికి ప్రత్నించక పోవడమే మనం చేస్తున్న పెద్ద తప్పు. కృషితో నాస్థి దుర్భిక్షం అన్న లోకోక్తి గుర్తు చేసుకోండి......మొదటి అడుగు వేసేటప్పుడు నీ వెనుక ఎవరు వుండరు, కాని మన అడుగు అటో ఇటో ఎటో వైపు వేయక తప్పదు....అది మనతోపాటు నలుగురికి మంచి చేయగలిగితే చాలు....ఈ జీవితానికి.

7, ఏప్రిల్ 2011, గురువారం

ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో మరి??


మొత్తానికి టీం ఇండియా విశ్వ విజేత అయ్యింది అందరి ఆశిస్సులతో.......మరి మన యువరాజ్ ఇప్పటికయినా తన వెనుకనున్న స్పూర్తి ప్రధాత గురించి ప్రపంచకప్ అందుకోగానే చెప్తాను అన్నారు...ఆ వ్యక్తి ఎవరో ఎవరో.....ఇంక తెర చాటుగా కాకుండా అందరికి చెప్తే బావుంటుంది....కప్ గెలవడంలో, యువి ఆటలో రాణించడంలో కీలక పాత్ర వహించిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో మరి??
నేను ఆ రోజు కొన్ని కొన్ని చూడటం మిస్ అయ్యాను ఇప్పుడే ఎవరో అజ్ఞాత గారు చెప్పారు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు మన సచినే అని....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner