28, జనవరి 2010, గురువారం

చిన్ననాటి తీపి గురుతులు....

విజయనగరం దగ్గరలో పల్లెటూరు, ఆ ఊరికి రెండు మైళ్ళ దూరంలో గవర్నమెంట్ హైస్కూల్ లో టెన్త్ వరకు చదివాము. బాగా వెనుక పడిన ప్రాంతం అప్పుడు. చాలా తక్కువ మంది చదివేవాళ్ళు. రెండు ప్రైవేటు బస్సులు తిరుగుతూ ఉండేవి విజయనగరం వరకు. అన్ని మామిడి తోటలు, చెరుకు పొలాలు, వేరుసెనగ, ఇంకా చాలా తోటలు ఉండేవి మా వూరు నుంచి స్కూల్ వున్న వూరు వరకు. వేసవి లో ఒంటిపూట బడులప్పుడు బస్సు వుండేది కాదు పొద్దున్నే. నడుచుకుంటూ వాక్కాయలు, పుల్లరేగుకాయలు తింటూ, మామిడి కాయలు దొంగతనంగా కోసుకుని ఉప్పు కారం తో తింటే అబ్బాఆ రోజులే భలే ఉండేవి. తెలుగు మాస్టర్ గారు నాతోనే పాఠం చదివించే వారు, ఒక్క తప్పు అయినా చదువుతానేమో అని. టెన్త్ వరకు నేనే చదివేదాన్ని ఒక్క తప్పు లేకుండా....ఇక్కడ ముఖ్యం గా కొంత మంది గురించి చెప్పాలి. మా హింది టీచర్ గారి గురించి చెప్పాలి. మాకు పాఠాలే కాకుండా జీవితం లో జరిగే ఎన్నో విషయాలను, కధలను, కబుర్లను, చెప్పే వారు. లెక్కల మాస్టర్ గారు చాల బాగా లెక్కలు చెప్పే వారు. ఈయన అంటే అందరికి భయం. ఇక సైన్సు , సోషల్ మాములు గా చెప్పే వాళ్ళు. స్కూల్ లో చిన్న చిన్న పోట్లాటలు జరుగుతూ వుండేవి.

ఇంకా వుంది.....

తేనేలూరే తీపి గురుతులు-బాల్యం

నాకు తెలిసి చిన్నప్పటి జ్ఞాపకాలు అందరికి గుర్తు వుండే ఉంటాయి. మాది వుమ్మడి కుటుంబం అప్పుడు. మా అమ్మ ఒక్కటే అమ్మమ్మ వాళ్ళకు, లేక లేక పుట్టిన సంతానం. మా నాన్న గారు అమ్మ కు మేనమామ. అమ్మ పుట్టిన పదహారు ఏళ్లకు మా మామయ్య పుట్టాడు, తరువాత ఆరు నెలలకు నేను పుట్టాను. చిన్నప్పుడు మేము వేరే ఊరులో ఉండి చదువుకునే వాళ్ళము. మాతో అమ్మమ్మ వుండేది. మా స్కూల్ భలే వుండేది. అప్పుడే కొత్తగా బిల్డింగ్స్ కడుతూ వున్నారు, మాకు చింత చెట్ల క్రింద చదువు చెప్పే వాళ్ళు. మేము సెకండ్ క్లాసు నుంచి ఆ స్కూల్ లో చదివాము. మా స్కూల్ పేరు శిశువిద్యామందిరం. రెండవ తరగతి లో ఆచారి మాస్టరు గారు, పింగళి మాస్టరు గారు క్లాసెస్ చెప్పే వాళ్ళు. పింగళి మాస్టరు గారు పాటలు కుడా చాలా బాగా నేర్పేవారు. ఇక మూడు లో నాగలక్ష్మి టీచర్ గారు వుండే వారు. అప్పుడే నేను నా ఫ్రెండ్ కలిసి వెంకటేశ్వర సుప్రభాతం చెప్పే వాళ్ళము, మా స్కూల్ లో అప్పుడే ఆరువందల మంది పిల్లలు వుండే వాళ్ళు. ప్రేయర్ కుడా అప్పటి నుంచే నేను నా ఫ్రెండ్ చెప్పే వాళ్ళము. ప్రేయర్ తో పాటు ఒక సంసృత శ్లోకం కుడా చెప్పి దాని అర్ధం చెప్పే వాళ్ళము. తరువాత న్యూస్ పేపర్ కుడా చదివే వాళ్ళు. ఇక లేట్ గా వచ్చిన వాళ్ళ కు పనిష్మెంట్ వుండేది. తరువాత క్లాసెస్ స్టార్ట్ .....క్లాసెస్ లో పాఠాలతో పాటు డ్రాయింగ్, డిబేట్స్, ఆటలు ఇలా అన్ని ఉండేవి.సాయంత్రం స్టడీ క్లాసెస్ ఉండేవి, వాటిలో కొద్ది సేపు చదువు, తరువాత భగవద్గీత, హనుమాన్ చాలీసా .....ఇలా ఎదో ఒకటి చదివించే వాళ్ళు. స్కూల్ ఐన తరువాత పక్కనే పార్క్ లో ఆడుకోడం, దగ్గర లోనే లైబ్రరీ కి వెళ్లి పుస్తకాలు చదివి ఇంటికి వెళ్ళడం.... ఇలా ఇంకా చాలా విశేషాలు ఆ స్కూల్ లో వున్నన్ని రోజులు ఇలాగే వుండేది.

శ్రీలత టీచర్ గారు పాటలు బాగా పాడి నేర్పించే వాళ్ళు, సోషల్ చెప్పే వాళ్ళు. రత్నరావు గారు హెడ్ మాస్టర్ గారు ఇంగ్లీష్ చెప్పే వాళ్ళు. ప్రైవేటు క్లాసెస్ పెట్టి కొద్ది గా తప్పు చదివినా బాగా కొట్టే వారు. ఇంకా తెలుగు మాస్టర్ గారు, లెక్కల మాస్టర్ గారు, సైన్సు మాస్టర్ గారు, కమల టీచర్ గారు, హింది టీచర్ ప్రమీల రాణి గారు, మీసాల మాస్టర్ గారు ఇలా ఎందరో మహానుభావుల పుణ్యం ఈ రోజు ఇలా వున్నామంటే......
ఇక సెలవు రోజు ఐతే గాలి గోపురం దగ్గరకు, పక్కనే శివాలయం, కొద్ది దూరం లో లంకమ్మ గుడి మద్య మద్య లో ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళ్ళడం,ఆటలు సరిపోయేవి. సిక్స్ క్లాసు వరకు చదువు ఇలా సాగింది. మద్యలో అమ్మకు ఆరోగ్యం బాలేక మా వూరు నుంచి ఆ రోజులలో బస్సు లో వెళ్ళేవాళ్ళము ఆరు మైళ్ళు. తరువాత విజయనగరం వెళ్ళిపోయాము.
ఇంకా వుంది........

మా ట్రస్ట్ గురించి.....

ఈ URLC ట్రస్ట్ గురించి చెప్పాలంటే....అమ్మ నాన్న లేని పిల్లల కోసం టెన్త్ తరువాత నుంచి ఎంత వరకు చదువుకుంటే అంత వరకు చదువు చెప్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. మీకు టైం దొరికినప్పుడు ఈ క్రింది వెబ్ సైట్ ని చూడండి URLC ట్రస్ట్ వివరాల కోసం.
http://www.urlctrust.com/
సాయం చేయాలనుకునే సహృదయులందరికి స్వాగతం...

27, జనవరి 2010, బుధవారం

మాఘ పౌర్ణిమ - పాత జ్ఞాపకాలు

మా ఊరికి దగ్గర లో సముద్రం వుంది. మాఘ పౌర్ణిమ ౩౦ జనవరి న ఈసారి. అంటే ఆ రోజు సముద్ర స్నానాలు అన్నమాట.మా చిన్నప్పుడు ముందు రోజు రాత్రే హంసలదీవి వేణుగోపాలస్వామి గుడి కి వెళ్లి ఆ రాత్రి అక్కడ భజనలు, కోలాటాలు, నాటకాలు, హరికథలు, ఇలా ఎన్నో .....ఉండేవి.... పౌర్ణమి ముందు రోజు సాయంత్రం, అప్పట్లో ఎడ్ల బండి లో ఎక్కువ గా వెళ్ళేవాళ్ళం. అందరమూ కలిసి తినడానికి పులిహోర, పెరుగు, ఇంకా తినడానికి చాలా రకాలు పండుగ వంటలు ఉంటాయి గా అవి అన్ని తేసుకు వెళ్ళేవాళ్ళం. దేముడి దర్శనం చేసుకుని పెద్ద వాళ్ళు భజనల దగ్గర వుంటే పిల్లలము కోలాటాల దగ్గరకి నాటకాల దగ్గరకి వెళ్ళేవాళ్ళం. తెల్లవారు ఝామున గుడి దగ్గర నుంచి బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తరువాత కాలినడకన ౨, ౩ మైళ్ళు నడిచి సముద్రం దగ్గరకు చేరేవాళ్ళం. పొద్దు పొడుస్తూ ఉన్నప్పుడు సముద్రస్నానాలు చేసే వాళ్ళం. ఇక అవి అయిన తరువాత మళ్ళి గుడి దగ్గరకు వచ్చి దేముడి దర్శనం చేసుకుని షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేసి ఇక ఇళ్ళకు బయలుదేరతారు. చెప్తుంటే ఇంతేనా అనిపిస్తుంది, కాని ఆ రోజులు భలే ఉండేవి ఆ అనుభూతులు మరల మరల కావాలి అన్నా రావు, ఇలా గుర్తు చేసుకోడం తప్ప ఇంక ఏమి చేయలేము కదా!!



20, జనవరి 2010, బుధవారం

మనిషి - నటన

ఈనాటి మానవ సంబంధాలలో ఇతరుల తో నటిచడమే కాకుండా మనతో మనం కుడా నటిస్తూనే వున్నాము. బతికే ఈ నాలుగు రోజుల కోసం ఇలా మనతో మనం కుడా నటించడం అవసరం అంటారా!! ఒక్క సారి ఆలోచించండి...?

మన స్వార్ధం కోసం వాళ్ళ మీద వీళ్ళకు వీళ్ళ మీద వాళ్ళకు చెప్పి మనం లాభ పడటం సమంజసమా!!

పైకి తీయగా మాట్లాడుతూ మనకింద గొయ్యి చాలా నేర్పు గా తవ్వడం కొంత మందికి దేముడు ఇచ్చిన గిఫ్ట్.

నాకనిపిస్తుంది చెప్పేవాళ్ళు ఎప్పుడు వుంటారు, విని నమ్మే వాళ్ళది తప్పు అని.

విన్నది నిజమా!! కాదా!! అన్నది మన విజ్ఞతలో వుండాలి. దేముడు మనకు ఆలోచన ఇచ్చింది మంచి చెడు బేరీజు వేసుకుని మనం మంచి నడవడి తో జీవించడానికి, మృగాలుగా జీవించడానికి కాదు. మన అన్న స్వార్ధం వుండాలి కాని ఎదుటి వాడి నాశనాన్ని చూసేది కాకుండా వుండాలి. అప్పుడే మనం మన పిల్లలు అందరు బాగుంటారు.

మనిషి గా పుట్టినందుకు మానవ సంబంధాలను అనుబంధాలను, ఆప్యాయతలను మర్చి పోకండి. మనీషి గా బ్రతకండి.



Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner