అసలు ఏంటి ఆ...సత్యం? ఎవరు సమాధి చేసారు? ఎవరి ప్రేమేయం ఎంత? మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, దేశాధినేతలు ఇంత మంది వచ్చారు....చూసారు....వెళ్లారు.
నిజ నిర్ధారణ చేయాల్సిన పని మాది కాదు అన్నట్లు ఉంది వారి పని తీరు..
మీడియా ప్రశ్నిస్తున్నా ఎవరు వినపడనట్లు ఉంటున్నారు, అన్ని సందేహాలు ప్రజలకే కానీ....ప్రభుత్వానికి కాదు అన్నట్లు ఉంది చూస్తుంటే.
మన రాష్ట్ర నాయకులకి ఉపఎన్నికల మీద ఉన్న శ్రద్ధ కోట్ల మంది భక్తుల దైవం ఐన సాయి మరణం పై ఉన్న సందేహాల మీద లేకుండా పోయిందా?
ఏమి జరిగింది అసలు?
ఎవరు చేశారు?
ఎలా చేశారు?
ఎందుకు చేశారు?
ఇవి సగటు ప్రజానీకానికి వస్తున్న ధర్మ నిలయంలో. ప్రశాంతి నిలయంలో ప్రశాంతి నిలయంలో సమాది చేసారు, అంతే ఇవి ఇంక ఎప్పటికీ సమాధానం లేని, దొరకని సందేహలేనా....?? అంటే అవును అనే చెప్పాలి.
దైవం అని చెప్పుకునే ఆశ్రమ పెద్దలే ఇలా శ్రీకాంత్ సాయంతో అసలు ఈ దైవత్వానికి ఉన్న శక్తి ఎంత? అసలు బాబా దేవుడే నా?? అయితే తనని తను కాపాడుకోలేక పోయరా? అసలు ఆ ఆశ్రమం లో ఉన్నది దైవత్వమ లేక ధనతత్వమా?
ఇవి మనసులో ఉన్నా...మాట ద్వారా బయటకి రాలేకపోతున్న ప్రశ్నలు.
ఒక మనిషి అదుపు చేయలేనంత సంపద ఆ మనిషి(దేవుడిని ఐన) నీ మరణశయ్య మీదకి తీసుకువెళుతుంది అని నిరూపించిన యుగం మన కలియుగం.
తరతరాలుగా జరుగుతున్న సహజ ప్రక్రియే అయినా విన్న ప్రతిసారి ఏదో తెలియని కలత,కలవరం. ఒక మనిషికి అనుభవించలేనంత పేరుప్రతిష్టలు, ఆస్థిఅంతస్థులు వస్తే ఆఖరికి ఏమౌతుందో?? అందుకు నిదర్శనమే సత్యన్నారాయణరాజు అలియాస్ సత్యసాయిబాబా జీవితం. మహిమలు, ఆధ్యాత్మికత, సామాజిక సేవ, విద్యాలయాలు....ఇలా పలురకాలుగా జనంలోకి చొచ్చుకుని పోయిన సత్యసాయి తన ఉపన్యాసాలతో దేశీయులనే కాక విదేశీయులను సైతం తన వాక్చాతుర్యంతో తన భక్తులుగా చేసుకున్నారు, ఎనలేని సంపదలను గడించారు. ఆఖరికి అవసాన దశలో తన చుట్టూ ఉన్న వారి చేతిలో కీలుబొమ్మగా మారారు. బతికి ఉండగానే శవపేఠికను సిద్ధం చేసి సాయిని గురించి, ఆయన ఆరోగ్యాన్ని గురించి పలురకాల అనుమానాలకు తావిచ్చిన ట్రస్టు సభ్యులు, కుటుంబసభ్యులు, అధికార ప్రముఖులు ఎందుకు పారదర్శకంగా లేరు అన్నదానికి సమాధానం లేదు ఇప్పటికీ...!!
దైవ సమానుడని, దివ్య మహిమలు వున్నవాడని నమ్మిన ఎంతోమంది భక్తులకు చివరి దశలో ఏమి జరిగింది?? అన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది. ఆస్థులకోసమే ఆనాడు చిన్నారి వైష్ణవి కాలి బూడిద అయింది. ఈనాడు దైవస్వరూపుడు కీలుబొమ్మైనాడు. సత్యసాయి సత్యం సమాధైంది....మరొక్కసారి చరిత్ర పునరావృతమైంది.....ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న మహాకవి శ్రీశ్రీ మాటల్లో నిజమెంతో ఈపాటికి మనకి అర్ధమైవుండాలి....
ప్రశాంతి నిలయంలో అశాంతి పాలైన ఆ మహా మనీషి ఆత్మకి మనశ్శాంతి సిద్దించాలని ఆ దైవాత్మ శివైఖ్యం కావాలని కోరుకుంటూ.....
(శ్రీకాంత్ సాయంతో.....)
అన్నట్టు చెప్పడం మరిచానండోయ్ ఇది నా రెండువందల టపా!! రాతలను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికి కృతజ్ఞతాపూర్వక వందనాలు......
17 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మీ ప్రశ్నలన్నీ ఇహ అంతే సంగతులు !
విజయ వంతముగా 200 ల టపాలు పూర్తి చేసినందుకు అభినందనలు .
రెండువందల టపాలు పూర్తి చేసినందుకు అభినందనలు మంజు గారూ
మరిన్ని రాయలని కోరుకుంటూ
అవి నా ప్రశ్నలే కాదండి మాలా గారు అందరివి కదా!!
థాంక్యు మాలా గారు, లత గారు...మంచి టపాలు రాయడానికి ప్రయత్నిస్తా!!
మనిషి పోయాక ఎన్నెన్నో వస్తాయి.
ఆయన మాత్రం తామరాకు మీద నీటి బొట్టు.
వదిలేయండి మేడం !
అన్నట్లు మీ బిలాగు డబుల్ సెంచెరీ కొట్టినందుకు,
నా అభినందన అక్షరమాల.స్వీకరించండి.
:-) థాంక్యు సోమార్క గారు...వదిలేయక ఏమి చెయ్యలేము చూస్తూ ఊరుకోవడం తప్ప...!!
అభినందనలండి. మీరూ, నేనూ ఇంచుమించు ఒకేసారి బ్లాగ్ మొదలుపెట్టాం. మీరు అప్పుడే 200 రాసేశారు. :)
థాంక్యు శిశిరా అవునా ఒకటే సారా!! ఏమోనండి అలా రాసేసాను నాకు తెలియకుండానే ఇన్ని టపాలు రాసేసాను.....:-)
అభినందనలు మంజు గారు . రెండువందల టపాలంటే మాటలు కాదు మరి
:-) థాంక్యు లలిత గారు అనిపించినవి రాసుకుంటూ పోయాను.....అంతే అండి.
ద్విశత టపోత్సవ శుభాకాంక్షలు ..
200 *.. .. ..
థాంక్యు స్వామి గారు..బ్లాగు లో టపా బజ్ లో వచ్చేస్తుంది ఎప్పుడూ ఎందుకనో ఈ టపా రాలేదు
విజయ వంతముగా 200 ల టపాలు పూర్తి చేసినందుకు అభినందనలు
థాంక్యు జ్యోతి గారు
"ఒక మనిషి అదుపు చేయలేనంత సంపద ఆ మనిషి(దేవుడిని ఐన) నీ మరణశయ్య మీదకి తీసుకువెళుతుంది అని నిరూపించిన యుగం మన కలియుగం."
చాలా బాగా చెప్పారు మంజు గారు...
మీరు 200 పోస్ట్ లు పూర్తిచేసుకున్నందుకు అభినందనలు...
ఆ మాటలు శ్రీకాంత్ చెప్పినవి రాజి గారు థాంక్యు
2000 poorti cheyyalani korukuntu...
థాంక్యు .....:-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి