28, మే 2012, సోమవారం

మనవి సక్రమ ఆస్థులా..!!

అక్రమ ఆస్థులు అని గోల పెడుతున్నారు ఇంతకు ముందు అవి ఆక్రమ సంపాదన అని గుర్తు రాలేదా!! అందరూ లాభం పొందిన వాళ్ళే కదా ఈ రోజు జగన్ ఒక్కడే దోషి అని అంటున్నారు...!! మనకు లాభం వస్తే వాళ్ళు ఎలాంటి వెధవలయినా చాలా మంచోళ్ళు....మనకు ఎదురు తిరిగితే మాత్రం దోషులు...!!
ఒక్క జగన్ వి మాత్రమే అక్రమ ఆస్థులా...!! మిగిలిన అందరివి సక్రమ ఆస్థులా..!! మరి చట్టం తన పని తను చేసుకు పోడం లేదెందుకో....!! సారా అమ్ముకోవచ్చు...ఇసుక దందాలు చేయవచ్చు....హత్యలు చేయించ వచ్చు...సెటిల్మెంటులు చేయించ వచ్చు అవి అన్ని క్రమ సంపాదనలే..!! మీ అడుగులకు మడుగులు ఒత్తితే క్రమమే అంతా...!! లేక పొతే అన్ని తప్పులు...!! అప్పటి ఒప్పులు ఇప్పుడు తప్పులు....!!
అమ్మగారికి అప్పుడు గుర్తు రాలేదా లేక తెలియలేదా వేల వేల కోట్లు ఎలా వస్తున్నాయో అని..!! పార్టి పెట్టి సొమ్ము బాగా చేసుకుని విలువలను, విధానాలను గాలికి వదిలేసి మీ పంచన పదవి కోసం చేరితే అబ్బో....చాలా మంచివాడు..!! మొన్ననే కదా మరి అల్లుడి ఇంట్లో సొమ్ము దొరికింది మరి దానిపై ఏ మాటా!! లేదు....అందరూ మర్చిపోయారు కూడా..!! అవును కదూ అవి అన్ని సక్రమ ఆస్థులు కదా అందుకే వాటి లెక్కలు అక్కరలేదు...!! అయినా పరాయి వాడేమి కాదు కదా..!! మనవాడే మనం ఎంత చెప్తే అంత..!!
ఈ రోజు రాజకీయాల్లో ఉన్న అందరివి సక్రమ ఆస్థులు...!! సక్రమ సంపాదన....!!
యధా రాజ తదా ప్రజా లెక్కన ఉన్నాం ఈ రోజు ప్రజాస్వామ్యంలో...!!
ఎవరి మనస్సాక్షి కి వాళ్ళకే తెలుసు మనం ఒకళ్ళని అనే ముందు మనం ఏంటో..!! చూసుకోవాలి...!!
ఒక జగన్ కానివ్వండి,,ఒక రాజశేఖర రెడ్డి కానివ్వండి మన అవసరానికి వాళ్ళని వాడుకున్నాము మనము తిన్నాము వాళ్ళు తిన్నారు...కాదంటారా..!!
కేసుల్లోనుంచి బయట పడ్డాము మన తప్పులు కప్పారని ఈ రోజు వాళ్ళని అనకూడదు...!!
జనాల సొమ్ము తినని.. ఒక్క నాయకుడిని చూపించండి...!!
తప్పు మనదే..!! మనం ఎన్నుకునే క్రమం లోనే మోస పోతున్నామో లేక ఏ రాయి అయితే ఏంటిలే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని సరిపెట్టుకుంటున్నామో...!!
కనీసం ఇక నైనా ప్రతి ఒక్కరు ఓ క్షణం ఆలోచిస్తే కాస్త అయినా ప్రయోజనం ఉంటుందేమో..!!

62 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

thuuu....

అజ్ఞాత చెప్పారు...

తప్పు చేసే వాడిని సమర్ధించడం ఆచారం అయ్యిందా?

చెప్పాలంటే...... చెప్పారు...

:) పేరు కుడా చెప్పలేని......!!
మీరు పొరపాటు పడ్డారు తప్పుని సమర్ధించ లేదు....అందరూ తప్పులే చేసారు ఒక్కడే కాదు అని చెప్పాను...!! న్యాయం అందరికి సమానంగానే వుండాలి కదా మరి..!!

Mauli చెప్పారు...

మంజు గారు, పక్క వాళ్లకి సమస్య లేకుండా దోచుకొంటే కాని, లేదా దోచుకొన్న మనిషి పక్క వాళ్ళని బాఘా గౌరవిస్తుంటే కాని ఇంతన్నాయం జరిగెదా ? ( ఎవరినీ బాధ పెట్టకుండా ఉన్నంతవరకు తప్పుడు పనులెవరైనా చెయ్యొచ్చు అని ఒక మంచి వ్యాఖ్యాత గారేపుడు బ్లాగుల్లో చెపుతూనే ఉన్నారు కదా, వారి సౌజన్యం తో :) )

భారత చరిత్ర లో మరో అధ్యాయం మొదలయ్యింది, ఇప్పటి నుండి ఒకరు దోచుకొన్న దాన్ని ఇంకొకరు కేసులు పెడుతూ , వాళ్ళలో వాళ్ళే సర్దుబాట్లు చేసుకుంటూ ఉంటారు. మనం పట్టించుకోవడం మానేస్తాం .

Sravya V చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sravya V చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sravya V చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sravya V చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
జలతారు వెన్నెల చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
జలతారు వెన్నెల చెప్పారు...

I am not able to understand why every one is so much in support of this guy and his father when every single soul knows both of them are so higly corrupted. We are not talking about some 100 crores , but in thousands of crores. How he is caught today , and is that because of some other politics is not the issue. He should be caught and punished and there should be no more discussion about that. However if the question arises , if the politicians before him are not corrupt? And everyone knows no one is clean, and everyone is corrupt , and if the CBI has evidences and if they do their job properly they should be also punished. Law should be above all parties and should not be partial to anyone single party / individual. All educated folks here, please do not support that highly corrupted guy just because all of you have some personal feelings rowards him. Please......

Sravya V చెప్పారు...

మంజు గారు కామెంట్ బాక్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది అండి, ఆ పై కామెంట్లు నేనే డిలీట్ చేసాను .

Sravya V చెప్పారు...

మౌళి గారు మీరు స్వంతం గా ఒక ముక్క రాయలేరా ఏంటి సంవత్సరాల తరబడి అదే పని గా అదే వాఖ్యత ని తెగ ఫాలో అవుతున్నారు . అయినా ఆ పాటి భయం భక్తీ అవసరమే , పుణ్యం వస్తుందేమో అదే పని గా పారాయణం చేయండి మంచిదే .

Praveen Mandangi చెప్పారు...

http://4proletarianrevolution.mlmedia.net.in/129940593

Praveen Mandangi చెప్పారు...

అన్నా హజారేకి మద్దతు ఇచ్చిన బ్లాగర్లే ఇప్పుడు జగన్‌ని మాస్ మసాలా హీరోలాగ చూస్తున్నారు. ఇది పచ్చి self-contrast కాదా?

చెప్పాలంటే...... చెప్పారు...

స్పందించిన అందరికి నా ధన్యవాదాలు....

మనం అందరమూ అయ్యో తప్పులు జరుగుతున్నాయే అని బాధ పడుతున్న వాళ్ళమే...కాని ఏమి చేయలేని వాళ్లము ఐయ్యాము...ఇది ఇలానే జరుగుతూ వుంటే రేపటి నుంచి గాలి పిల్చుకోవడానికి కూడా లంచం ఇవ్వాల్సి వస్తుందేమో..!!

శ్రావ్య మౌళి గారు వెన్నెల మీరు చెప్పింది జరుగుతున్నదే....

ప్రవీణ్ గారు ఇష్టాలు మన అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి....అని అర్ధం చేసుకోవాలండి....-:)

నాయకులు, గొప్పవారు మేయడం అనేది ఎప్పటి నుంచో వున్న సమస్య ఈనాటిది కాదు...మనం మారాలి ముందు....!!

Praveen Mandangi చెప్పారు...

అవసరం అంటే ఏమిటి? జగన్‌లాంటి బకాసురులని మేపి, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తియ్యించి, ప్రజలని భిక్షగాళ్ళుగా చెయ్యడం అవసరమా?

చెప్పాలంటే...... చెప్పారు...

అన్నాహజారేని సమర్ధించిన వాళ్ళే జగన్ నీ సమర్ధిస్తున్నారు అన్నారు కదా అది అప్పటి అవసరం ఏమో మరి..!!

ముఖ్యమంత్రి కొడుకని అప్పుడు అందరూ సలాములు చేసారు మరి ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న బకాసురుడు అంటున్నారు....వాళ్ళు ఎప్పుడూ అలానే వున్నారు...!!

మొక్కై వంగనిది మానై ఒంగునా...మరి!!

అనుభవించాల్సిందే కదా..!! ఎవరైనా...!!

చెప్పాలంటే...... చెప్పారు...

వెన్నెల గారు..!!

అందరూ తండ్రి కొడుకులని సపోర్టు చేస్తున్నారు అంటే వాళ్ళ పని జరగడానికి లేదా జరిపిన్చుకోవడానికి డబ్బులు ఇస్తే పని చేసి పెట్టేవాళ్ళు....ఇద్దరు లాభం పొందే వాళ్ళు...ఒక్కరే తింటే పక్క వాడికి కోపం వస్తుంది కదా..!! అలా లాభ పడిన వాళ్ళలో కొందరు మాత్రమే జగన్ ని సపోర్టు చేస్తున్నారు....!!

తప్పుని తప్పే అంటాము కదండీ...కరప్షన్ చిన్నదా పెద్దదా అని కాదండి ఏదైనా ఒకటే....!!

నష్ట పోతోంది మనమే...ఇక్కడ నాయకులు బానే వుంటారు....మీరు బాధ పడకండి....!!

veera murthy (satya) చెప్పారు...

:)

అజ్ఞాత చెప్పారు...

ఏమిటో జగన్ పై ఈ ప్రత్యేక బిచ్చపుటెద! :))) ఏదైనా ATMకు కన్నమేయాలని ప్లాన్ వేస్తున్నారా ఏంటి?

జలతారు వెన్నెల చెప్పారు...

SNKR gaaru, meeru vanaja gaari kavita title copy kottesaaru... idi piracy ante, mimmalni CBI vadilipettadu....Just kidding!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మంజు గారు ఈ విషయం పై పోస్ట్ వ్రాయాల్సి వస్తే ..నేను ఇలాగే వ్రాస్తాను.
గురువింద గింజ వెనుక నలుపు ఎరుగదు అన్నట్టు.. అలా మేటలు వేసుకున్న అవినీతి ఇప్పుడే కనబడిందా ఏమిటీ !?
ప్రజల అవసరాలని ,పేద ప్రజల సంక్షేమాలని గాలికి ఒదిలేసి ఎవరు ఎంత దోచుకున్నారో..చెప్పడానికే ఈ ప్రహసనాలు.
నానాటికి రొష్టు పడుతున్న రాజకీయ నాయకుల నాయకత్వ లక్షణాలని చూసి జనంకి వాంతి రావడం లేదు.సానుభూతి చూపిస్తున్నారు. లేదా అభిమానం చూపిస్తున్నారు. ఎన్నికలు వస్తే కోట్లు ఖర్చు పెట్టి డబ్బు మదంతో ప్రజా బలం గెలుచుకున్నామని చెప్పుకునేదుకు కారణం కూడా నోటులకి అలవాటు పడ్డ జనం ది కాదంటారా? వాతం చూసి బలుపు అనుకునేవారికి..నిజమైన ఓటరు నాడి ఎలా ఉంటుందో.. చూస్తే అన్న భయం కలగనంత కాలం ఈ అవినీతి రాజకీయం వర్ధిల్లుతూనే ఉంటుంది.
ఈ మధ్య "రాజకీయ అమ్మల్ని చూస్తే సిగ్గు వేస్తుంది " అమ్మ తనాలకి కూడా!
గుడ్ మంచి పోస్ట్ వ్రాశారు.
అవగాహన కల్గించే పోస్ట్ .

అజ్ఞాత చెప్పారు...

జలతారువెన్నెలగారు,
మీ వ్యాఖ్యల ను చదివితే నవ్వు వస్తున్నాది. రాజన్నని ఎదో సామాన్య రాజకీయ నాయకుడిలాగా డబ్బులు తిన్నాడు అని మాట్లాడటం, ఆకోణంలో చూడటం మానుకోండి. ఆయన మాటతప్పని, మడమ తిప్పని మహానేత. అది ఆయన గొప్పదనం. నాయకుడు అంటే రాజన్న.

Mauli చెప్పారు...

>>>>ఎప్పటి నుంచో వున్న సమస్య ఈనాటిది కాదు...మనం మారాలి ముందు....!!


manju garu,

Can u pls explain what change you expect from people in this context?

---do you think public should not support and vote for jagan?????

or

--- public should not vote for sonia also as she ignored/enjoyed all these settlements...?

or

---we should not vote for the opposition(TDP) as they failed to fight with the govt. then in these issues..

or

--- public should sacrifice their lives to control the greedy industrialists(vanpic etc)?


other wise we can think of another way, i.e vote for a party who can close all CBI offices.

అజ్ఞాత చెప్పారు...

"తప్పు మనదే..!! మనం ఎన్నుకునే క్రమం లోనే మోస పోతున్నామో లేక ఏ రాయి అయితే ఏంటిలే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని సరిపెట్టుకుంటున్నామో!"
తప్పు ప్రజలది కాదు. ప్రజాస్వామ్యంలో మీడీయా విఫలంచెందటం వలన ఈ పరిస్థితి వచ్చింది. గత నాలుగు దశాబ్దాల కాలం నుంచి రాష్ట్రాన్ని పథకం ప్రకారం భ్రష్ట్టుపట్టించిన వారిలో మీడీయ అధినేత ప్రముఖ పాత్ర వహించారు. పేపర్ వాళ్లు ఎక్కడైనా మంచి కి,నీతి నిజాయితిగల వ్యక్తులకు మద్దతు ఇవ్వవలసింది పోయి, దానికి వ్యతిరేక దిశలో పనిచేస్తూ, కులగజ్జిని బాగా ఎగదోశారు. విలువలే లేని ఈ వర్గం చేతిలోని మీడీయా అందరికి నీతులు భోదిస్తూ, పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదను కొన్నట్లు వ్యవహరించేవాళ్లు. ఈ ముఠా వాళ్లని జగన్ భూతం పట్టినట్లు పట్టి, వారి లోగుట్టులన్ని బయట పడేశాడు. సాక్షి పేపర్ పుట్టుకకు కారణమే, మీడీయాని అవసరాలకి అనుగుణంగా,తన ఇష్టారాజ్యంగా వక్రికరించటమే కారణం. అధికారం, డబ్బున్న దన్న అహంకారం తో గత కొన్ని దశాబ్దాలుగా కులపిచ్చి తో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన ఆవర్గం వాళ్లే బాధ్యత వహించాల్సి ఉందేమో అని అనిపిస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

http://www.youtube.com/watch?v=R-KDQtkRGQk&feature=player_embedded#!

అజ్ఞాత చెప్పారు...

పిల్ల నిచ్చిన మామ ను వెన్నుపోటు పొడిచి, జడ్జి కి జయ ప్రద ని ఎరగా వేసి, పార్టీ ఫండ్ ని ఆధీనం లోకి తెచ్చుకొని మామ చావుకి కారణం అయ్యాడు. అంబానీ లకి 2 లక్షల కోట్లు దోచి పెట్టి , సింగపూర్ ,స్విట్జర్లాండ్ ,మలేసియా లో ఆస్తుల సమకూర్చుకొని ,తన కుల పత్రికలో అంబానీల ద్వారా పెట్టు బడులు పెట్టించిన ఎదవ ఒకడు.

మైనారిటీ వక్ఫ్ భూములు కాజేసి, ఎ ఎండకి ఆ గొడుగు పట్టి విద్యుత్ ప్రాజెక్ట్ కట్టకుండానే బిల్లు కాజేసి,దొంగ ప్రాజెక్టులు రాజస్తాన్ లో పెట్టి , మామ ద్వారా వచ్చిన రాజకీయ వారసత్వాన్ని, ఆస్తిని కాజేసి ,భార్యకి విడాకులు ఇవ్వకుండానే మలయాళ అమ్మాయి ద్వారా ఇంకో కొడుకుని కని, పిల్లల పెంపకం గురించి క్లాసు చెపుతున్న పరమ లాంకో నీచుడు ఒకడు.

గాంధీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని వహిస్తూ 250 బినామీ పేర్ల ద్వారా సారాయి షాపులు పెట్టి , ఆ రోజు ఆజాద్ కి నగ్మా ని ఎర వేసి టికెట్ లు తెచ్చుకున్న పరమ నీచాతి నీచుడు ఇంకొకడు.

దొంగ బియ్యం స్మగ్లింగ్ చేసి , దొంగ రాతలు రాసి ,పైరవీల ద్వారా విద్యుత్ ప్రాజెక్ట్ కొట్టి వేసి, పొట్ట కూటి కోసం ఉద్యోగం లో చేరిన ఉద్యోగిని వశబరుచుకొని, ఒక నాడు కూటికి గత లేని ఒక వెధవ ఇవాళ ఒక జ్యోతి పత్రిక పెట్టుకొని విలువలు గురించి బోధిస్తున్న ఇంకో జఫ్ఫా .

పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టి,రాష్ట్రం లో కుల పిచ్చి ఎగ దోసి, తన కుల ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు ప్రతి రోజు ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు కాజేశాడు. తన కుల ప్రభుత్వాన్ని ఆదేశించి రాష్ట్ర సహకార బ్యాంకు లు మూసేసి ,మార్గదర్శి ద్వారా కోట్ల రూపాయలు అక్రమంగా పెట్టుబడులు సేకరించి ఆస్తులు పెంచు కున్న పరమ నిక్రుస్టుడు ఇంకొకడు.

హై కమాండ్ కి సూట్ కేసు లు మోసి, రాజకీయ ప్రత్యర్ధుల మీద కేసు లు పెట్టి, ప్రజల దృష్టిలో పైసా విలువ చెయ్యని ముఖ్య సీటులో కూర్చున్న పరమ మురికి,లేకి వెదవ ఇంకొకడు.

మీ ఇంటి పెద్ద పాలేరు ను నేను అని రాజన్న దగ్గర కుక్క లాగ పడి ఉన్న ఒక వెదవ ఇవాళ మంత్రి పదవి రాగానే హైదరాబాద్ మొత్తం నాదే అనే దానాల బాబు ఇంకొకడు.

తుపాకి పెట్టి ప్రొడ్యూసర్ ని కాల్చి, వాచ్ మెన్ ను బలి ఇచ్చి, పాహిమాం అని రాజన్న కాళ్ళ మీద పడి , పెట్టిన చేతిని కరిచి, ఇవాళ సినిమాల్లో అవాకులు చెవాకులు వాగుతున్న బండ వెదవ ఇంకొకడు.

అనధికారంగా ఇంకో వనిత ద్వారా ఒక రాముడ్ని కని , వాళ్లకి వయసు వచ్చే వరకు వారిని నిర్లక్ష్యం చేసి, అంది వచ్చిన అదే కొడుకు అండ చూసుకొని ,ఆడపడుచులు ,తాళి బొట్లు అని నీతులే చెప్పే తాగు,తిరుగు బోతు వెదవ మరొకడు.

పార్టీ ని, టిక్కెట్లని హోల్ సెల్ గా అమ్మి , డబ్బుల కట్టలు మంచం కింద వేసుకొని నిద్ర పోతూ ,ఆడంగి కొడుకు ద్వారా ట్విట్టర్ లో ప్రభుత్వ సమర్ధ త మీద రాసే తాగుబోతు చిరు జీవి ఇంకొకడు.

తనని అధికారం లోకి తీసుక వచ్చిన కుటుంభాన్ని రోడ్ల మీదకి గుంజి, నీతు లు చెప్తూ స్విస్స్ బ్యాంకు లో వేల కోట్లు పోగేసుకున్న ఇటాలియన్ వనిత మరొకరు.

రామలింగ రాజు గారిని మోసం చేసి ,టీవీ తొమ్మిది పెట్టి , పారిశ్రామిక వేత్తలని బ్లాకు మెయిల్ చేసి ,పాపం పొట్ట కూటి కోసం యాంకరింగ్ చేసే ఆవిడని లోబరుచుకొని ,విదేశాల్లో ఆస్తులు కొని ,కుల గజ్జి తో రగిలి పోయి ,మెరుగయిన కుల సమాజం కోసం ఏడ్చే పరమ నీచుడు మరొకడు.

ఫీజు రిఎమ్బర్స్ మెంట్ ,ఉచిత విద్యుత్ ,పావాల వడ్డీ పధకాలు,ఇల్లు, వాకిళ్ళు కట్టించిన రాజన్నని ఇవాళ అవినీతి పరుడు అని ప్రచారం చేస్తూ ఒక నాడు ఆయన మోచేతి నీళ్ళు తాగిన పరమ నికృష్ట పు వెదవలు మరికొందరు నూ.

ఆనాడు విజయమ్మ ఈ కాంగ్రెస్స్ చెత్త వెదవల ని అందరిని అన్న అని పిలిచి, అన్న తిని వెళ్ళండి అన్న అని వ్యక్తిగతంగా అన్నం వడ్డించిన తల్లి లాంటి పెద్ద ఆమెని పట్టుకొని విజయ అని సంబోదించే నీతి,జాతి లేని కుక్కలు ఇంకొందరు.

రెండు ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని, అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు ,ఇతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు అని మీకే నీతులు చెప్తూ సన్నాయి నొక్కులు నొక్కే విషపురుగులు మరికొన్ని.

కలి కాలం లో ఇంతే తల్లీ . ఇవాళ వీళ్ళంతా శ్రీరంగ నీతులు బోధిస్తున్నారు తల్లి ,పాడు లోకం ఇది . తోట కూర కధలు, వంకాయ కధలు చెప్తూ నీతులు బోధిస్తున్నారు. మనకి వినే ఖర్మ తప్పడం లేదు. తప్పదు అండీ తప్పదు ,పాడు లోకం ఇది. మీరు ఇలాంటి రాతలు రాస్తే మీ మీద కూడా సిబిఐ కేసు వెయ్య గలరు జాగ్రత్త మంజుల అమ్మ.

అజ్ఞాత చెప్పారు...

aa pai anon evaro kani baga raasaaru, alage YSR family gurinchi kuda rasunte bagundedi.
:venkat.

Praveen Mandangi చెప్పారు...

మధ్యతరగతివాడు మునిసిపాలిటీ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో ఇల్లు కడితే మునిసిపాలిటీవాళ్ళు ఆ ఇల్లు కూల్చేస్తారు. జగన్ అనుచరులు ప్రభుత్వ అనుమతి లేకుండా బయ్యారం రిజర్వ్డ్ ఫారెస్ట్‌లో గనులు తవ్వినా వాళ్ళని ఏమీ చెయ్యలేదంటే ఇది చట్టం ముందు సమానత్వం లేకపోవడం కాదా? అక్రమ ఆస్తులు మధ్యతరగతివాళ్ళు సంపాదించలేరు కనుక మనవి సక్రమ ఆస్తులేనా అని మధ్యతరగతివాళ్ళని అడగడం అనవసరం.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు వనజ గారు

అందరూ నేను ఏదో జగన్ ని సపోర్టు చేస్తున్నాను అనుకుంటున్నారు ఇక్కడ జగన్ నా ఇంకొకరా అని కాదు వాళ్ళు మొదటి నుంచి అలానే చేస్తున్నారు...తప్పుని మొదట్లో ఎందుకు వదిలేసారు ? ఏవి అన్ని తప్పులు అని అప్పుడు తెలియలేదా!! లేక జగన్ ఇప్పటికీ కాంగ్రెస్ లో వుంటే ఈ గోల ఉండేదా!!

పెరిగే ధరలను జన జీవితాలను అస్తవ్యస్తం చేసే తీర్మానాలు చేయడం తప్ప జనానికి పనికి వచ్చే పనులు చేయరు. వాడు ఎంత తిన్నాడు విడు ఎంత తిన్నాడు మనం ఎవరి మీద బురద జల్లాలి....ఇవే గా నేటి రాజకీయాలు....!!

చెప్పాలంటే...... చెప్పారు...

ప్రవీణ్ గారు

ఇక్కడ సక్రమ ఆస్థులా!! అని అడిగింది మధ్యతరగతి వాళ్ళని కాదండి....నాయకులను బడా బాబులను...!!

మధ్యతరగతి వాళ్ళేం చేయగలరు ఒక్క ఓటు వేయడం తప్ప ...పెరిగే ధరలను భరించడం తప్ప...!!

Praveen Mandangi చెప్పారు...

"నాయకులు అందరివీ సక్రమ ఆస్తులా?" అని టైటిల్ పెట్టాల్సింది.

చెప్పాలంటే...... చెప్పారు...

పేరు చెప్పకుండా రాసినా అన్ని నిజాలే రాసారు...మనం తప్పు చేస్తూ వేరొకరిని వేలెత్తి చూపడం ఎందుకు అని అంటే...!! నా టపా ఉద్దేశ్యం అది...!! తినడం అందరూ తింటున్నారు ఒకడు ఎక్కువ మరొకడు తక్కువా అంతే తేడా..!! ఈ కేసులు ఎంక్వైరీలు అన్ని వాళ్ళ ప్రయోజనాలకే తప్ప మనకు ఒరిగేదేమీ లేదు..!!

మీ నిజాలకు నా ధన్యవాదాలు..!!

చెప్పాలంటే...... చెప్పారు...

మీడియాని అనడానికి లేదు ఎవరి కి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తారు వినే మనకు వుండాలి ఆలోచించే విజ్ఞత...

చెప్పాలంటే...... చెప్పారు...

మౌళి గారు నాయకులు మారాలంటే ఓటు ఎవరికీ వేయకుండా ఎలక్షన్స్ బాన్ చేయాలి....
తప్పు చేయాలంటే భయపడాలి నాయకులు. ఓటు ఆయుధం వుంది కాని మంచి నాయకులే లేదు ఒక్కరు కుడా..!!

చెప్పాలంటే...... చెప్పారు...

SNKR గారు ATM కి కన్నం వేద్దామన్నా దానిలో డబ్బులు వుండవు కదా!! -:)

సత్య గారు -:) థాంక్యు

చెప్పాలంటే...... చెప్పారు...

ప్రవీణ్ గారు పెరుదేముంది లెండి టపా చదివితే తెలుస్తోంది కదా నాయకులను పెద్ద బాబులను ఉద్దేశించినది అని....నేను మధ్య తరగతే అండి....-:)

జలతారు వెన్నెల చెప్పారు...

manju gaaru, sorry for posting again, but this for some anonymous guy who commented on my comment. Sure anonymous గారు..మీరు నవ్వుకోవచ్చు మీకు నవ్వొస్తే! మాట తప్పనంత మాత్రానా, మడమ తిప్పని వాడైనంత మాత్రానా అవినీతికి పాల్పడితే అవినీతిపరుడని అంటారే కాని, గొప్ప వాడని అనము కదా? మీరు చెప్పినట్టు మాట తప్పనివారు, మడం తిప్పని మహానేతే కావొచ్చు.. కాని అవినీతిపరుడు కూడా.. ఇక మిగతా రాజకీయ నాయకులందరు చెయ్యలేదా అవినీతి అంటే, అందరూ చేసారు, చేస్తున్నారు, ఇక పై కూడా చేస్తారు అని మనకందరికీ తెలుసు. వారు పట్టుబడలేదు, ఇతను పట్టుబడ్డాడు ఎవరో పగ బట్టిన కారణం గా.ఇప్పుడు ఒకరకంగా రాజకీయ నాయకుడంటేనే అవినీతికి కి మారు పేరు అని మనందరికీ తెలిసినా, మనం పర్వాలేదు, మాకు కూడా ఏవో పథకాల రూపం లో కొన్ని పాడేస్తే మీరు ఎంతైనా దోచుకోండి అని చెపుతున్నారా?
ఎవరైనా సరే, మిగతా అందరు అవినీతి పరులు కూడా-అది యే పార్టీ అయినా సరే, యే నాయకుడైనా సరే... ఇలాగే శిక్షింపబడాలి అని కోరుకోవాలే తప్ప,అవినీతిని ప్రోత్సహించకూడదు కదా? ఒకరకంగా నాకు తెలిసినంతవరకు, ఈ రకంగా అవినీతి చెయ్యొచ్చు అని ఒక ఇడియా ఇచ్చింది మీ రాజన్నకి అంతకు ముందు ఉన్న రాజకీయ నాయకుడే! అది తెలియని రహస్యమేమి కాదు. కనుక అవినీతిపరులు అందరు శిక్షింప పడాల్సిందే! No matter which party they belong to or what they have done to public! This is my opinion. Thank you!

అజ్ఞాత చెప్పారు...

@జలతారు వెన్నెల గారు,
నేను చెప్పింది గురివింద గింజల గురించి. మీరెందుకు ఉలిక్కి పడతారు. నేను ఎమన్నా రాజశేఖర్ రెడ్డి నీతి పరుడు అన్నానా? పై అరాజకీయులంతా అవినీతి పరునయినప్పుడు ఒక్కడిని పట్టి జైలు లో వెయ్యడం ఎందుకు? ఆంధ్ర రాష్ట్రం లో మొదటి సారి పొలిటికల్ వెండెట్ట మొదలు పెట్టారు. ఈ సారి జగన్ కి అవకాశం వచ్చిన రోజున పై న చెప్పినవాల్లందరికి వెనక నుండి శూలం దింపుతారు. ఆరోజు మీ లాంటి ఆంధ్ర అన్న హజారే లు బిర్యాని చేసుకొని,దీపావళి చేసుకుందురు గాని!!!

ఈ లోపులో ఈ కింద లింక్ చూసి మీ విలువయిన అభిప్రాయం వెలిబుచ్చండి.విని తరిస్తాము.

http://realitycheck.wordpress.com/2012/05/23/indian-media-uses-pictures-of-european-properties-against-jagan/

జలతారు వెన్నెల చెప్పారు...

ఒక్కరిని జైల్లో వెయ్యడం ఎందుకు అని ప్రశ్నించకుండా అందరిని జైల్లో వెయ్యలి అని అంటే అది కర్రెక్ట్ మాట. అవినీతి అంతమైనప్పుడు, అవినీతిపరులందరికి-("అందరికి") శిక్ష పడినప్పుడు, తప్పకుండా దీపావళి చేసుకోవాల్సినదే!

అజ్ఞాత చెప్పారు...

*ఈరకంగా అవినీతి చెయ్యొచ్చు అని ఒక ఇడియా ఇచ్చింది మీ రాజన్నకి అంతకు ముందు ఉన్న రాజకీయ నాయకుడే*

రాజన్నకు ముందున్న నాయకుడు అని అంట్టున్నారు. ముందున్న వాళ్లు ఒక్క వ్యక్తి కాదు. ఒక వర్గం. అదొక గుంపు. ఒకడు పేపర్, ఇంకొకడు టి వి, మరొకడు వ్యాపారం, విద్య,వైద్య వేరు వేరు పేర్లతో అధికారంలో ఉన్నపుడు వారు దోచుకోన్నారు. అధికారం పోయాక ఎవరికి వారు విడిపోయి తలా 10-15 వేల కోట్ల వ్యాపారాలతో సేటిల్ అయ్యారు. ఈ వర్గం వారు అధికారం అడ్డుపెట్టుకొని దోచుకోని రంగం లేదు.
రాజన్న అధికారంలోకి వచ్చిన మొదలు ఈ దోపిడి దార్లు ఆయన మీద కక్ష కట్టి మీడీయా ద్వారా చిన్న విషయాన్ని పెద్దది చేసి, రచ్చ చేస్తూ ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపే విధంగా ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేట్ వర్క్ వ్యవహారం అర్థమైన రాజన్న ఆంధ్రాకు చేసిన గొప్ప మేలు ఎమిటంటే వీరి బండారం బయటపడేశాడు. ఇప్పటివరకి ఈ కులగజ్జి ముఠా ప్రతి ముఖ్యమంత్రిని తమ అధుపులో ఉంచుకొని తెర వెనుక పెత్తనం చేలాయించారు. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా వీరిని ఎదుర్కొనే ధైర్యం చేయలేదు. ఒక్క రాజన్న తప్ప. ఎదుర్కోవటమే కాదు రెండవసారి ఎన్నికలలో గెలిచాడు. అది ధైర్యం అంటే, నాయకుడి కి ఉండవలసిన లక్షణం.

ఇక అవినీతి పరులను పెంచి పోషించింది ఆంధ్రా కులగజ్జి ముఠా వారే. పేపర్వాళ్లకి వందరకాల వ్యాపారల అవసరమేమిటి. ఆయన అన్ని వ్యాపారాలు చేసుకోవాలనుకొంటే పేపర్ వ్యాపారం వేరేవరికైనా ఇచ్చిఉండవచ్చు కదా! 40సం|| తెలుగుదేశ మధ్యతరగతి ప్రజలను రోజు కొద్ది కొద్ది డొసుతో డబ్బే జీవిత ధ్యేయం,అందరు అవినితి పరులే అంటు ప్రజలను బ్రైన్ వాష్ చేశారు. ఆయన కులస్తులు మంచి కవరేక్జ్ ఇచ్చుకొంట్టు, మిగతవారిని వేరే విధంగా చిత్రికరించలేదా?

అజ్ఞాత చెప్పారు...

*ఈరకంగా అవినీతి చెయ్యొచ్చు అని ఒక ఇడియా ఇచ్చింది మీ రాజన్నకి అంతకు ముందు ఉన్న రాజకీయ నాయకుడే*

రాజన్నకు ముందున్న నాయకుడు అని అంట్టున్నారు. ముందున్న వాళ్లు ఒక్క వ్యక్తి కాదు. ఒక వర్గం. అదొక గుంపు. ఒకడు పేపర్, ఇంకొకడు టి వి, మరొకడు వ్యాపారం, విద్య,వైద్య వేరు వేరు పేర్లతో అధికారంలో ఉన్నపుడు వారు దోచుకోన్నారు. అధికారం పోయాక ఎవరికి వారు విడిపోయి తలా 10-15 వేల కోట్ల వ్యాపారాలతో సేటిల్ అయ్యారు. ఈ వర్గం వారు అధికారం అడ్డుపెట్టుకొని దోచుకోని రంగం లేదు.
రాజన్న అధికారంలోకి వచ్చిన మొదలు ఈ దోపిడి దార్లు ఆయన మీద కక్ష కట్టి మీడీయా ద్వారా చిన్న విషయాన్ని పెద్దది చేసి, రచ్చ చేస్తూ ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపే విధంగా ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేట్ వర్క్ వ్యవహారం అర్థమైన రాజన్న ఆంధ్రాకు చేసిన గొప్ప మేలు ఎమిటంటే వీరి బండారం బయటపడేశాడు. ఇప్పటివరకి ఈ కులగజ్జి ముఠా ప్రతి ముఖ్యమంత్రిని తమ అధుపులో ఉంచుకొని తెర వెనుక పెత్తనం చేలాయించారు. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా వీరిని ఎదుర్కొనే ధైర్యం చేయలేదు. ఒక్క రాజన్న తప్ప. ఎదుర్కోవటమే కాదు రెండవసారి ఎన్నికలలో గెలిచాడు. అది ధైర్యం అంటే, నాయకుడి కి ఉండవలసిన లక్షణం.

ఇక అవినీతి పరులను పెంచి పోషించింది ఆంధ్రా కులగజ్జి ముఠా వారే. పేపర్వాళ్లకి వందరకాల వ్యాపారల అవసరమేమిటి. ఆయన అన్ని వ్యాపారాలు చేసుకోవాలనుకొంటే పేపర్ వ్యాపారం వేరేవరికైనా ఇచ్చిఉండవచ్చు కదా! 40సం|| తెలుగుదేశ మధ్యతరగతి ప్రజలను రోజు కొద్ది కొద్ది డొసుతో డబ్బే జీవిత ధ్యేయం,అందరు అవినితి పరులే అంటు ప్రజలను బ్రైన్ వాష్ చేశారు. ఆయన కులస్తులు మంచి కవరేక్జ్ ఇచ్చుకొంట్టు, మిగతవారిని వేరే విధంగా చిత్రికరించలేదా?

జలతారు వెన్నెల చెప్పారు...

తప్పు ఎవరు చేసినా తప్పే! సరే! ఇది నా బ్లాగ్ కాదు, మంజు గారిది. ఆవిడ బ్లాగ్ లో మనం ఇలా కామెంట్స్ రాయడం సబబు కాదు. మంజు గారు! sorry అండి. మీ బ్లాగ్ లొ పలుసార్లు కామెంట్ పెట్టినందుకు. తప్పు ని తప్పు అని చెప్పే తప్పు ని నేను మాత్రం ఇక పై చెయ్యకూడదు అని అర్ధం చేసుకున్నాను. మీకు ఇంకోసారి క్షమాపణలు చెప్పుకుంటూ ఇదే నా ఆఖరి కామెంట్ ఇక.

Mauli చెప్పారు...

మీరు చెప్పేది (ఓటు వెయ్యడం మానెయ్యడం ) ఏ విధం గా పరిష్కారం అవుతుందో నాకు అర్ధం కావడం లేదు.

అజ్ఞాత చెప్పారు...

/అరాజకీయులంతా అవినీతి పరునయినప్పుడు ఒక్కడిని పట్టి జైలు లో వెయ్యడం ఎందుకు? /

ఒక్కరొక్కరుగా అందరూ వెళతారు, కనీసం అక్కడైనా క్యూ వద్దూ? మరీ పదండి ముందుకు పదండి తోసుకు అనడానికదేమైనా రిలీజైన సినిమాకాదే! చంచల్‌గూడ జైలాయె.

/ఆంధ్ర రాష్ట్రం లో మొదటి సారి పొలిటికల్ వెండెట్ట మొదలు పెట్టారు/
వెండెట్ట కాదు, ముసలం... మంచిదేగా!

/నేను ఎమన్నా రాజశేఖర్ రెడ్డి నీతి పరుడు అన్నానా? /
అలా సరిగ్గా చెప్పి ఏడ్వచ్చుగా... రాజన్న రాజన్న అని నిప్పుతొక్కినట్టు బ్లాగు బ్లాగులా గింజుకుపోతుంటే .. వాని తమ్ముడు సో అనుకున్నా! :)))) :))) :)))) :P

ట్రూతు సీకరంట ట్రూతు సీకరు... అరవకుండా టూత్ పీకేయాలి.

Snkr

అజ్ఞాత చెప్పారు...

కాంగ్రెస్ అధిష్టాన౦ అ౦డ లేకు౦డానే, వారికి వాటాలు అ౦దకు౦డానే రాజశేఖర రెడ్డి అతడి మ౦త్రి వర౦లోని కొ౦తమ౦ది సహచరులు మాత్ర౦ ఇద౦తా చేశారా?
సిబిఐ నిష్పాక్షిక విచారణ లో అధిష్టాన౦ గురి౦చిన ఆనవాలే లేకపోవడ౦, ఐదో తరగతి విద్యార్థికి సైత౦ అబ్బుర౦ కలిగిస్తో౦ది.
అ౦తా ’అమ్మ’ మాయ! చూద్దా౦ ఎ౦తవరకూ రక్తికట్టిస్తారో.

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు చెప్పింది అందరికి తెలుసండి కాని ఎవరు అమ్మ గురించి మాట్లాడరు....నేను అనేది అదే వాళ్ళు మొదటి నుంచి అంతే వున్నారు అప్పటి ఒప్పులు ఇప్పుడు తప్పులా..!! అని...ఈ రోజు జగన్ గురించి మాట్లాడే నాయకులంతా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో తినలేదా...!! వాళ్ళ పనులు చేయించుకోలేదా..!!

అందరూ దొంగలే దోచుకున్నారు వీళ్ళు ఎక్కువ దోచుక్కున్నారే అని వాళ్ళ బాధ..!! జనంలో పేరు వచ్చింది కదా అది కూడా ఇబ్బందే అనేకదా ఒక ముఖ్యమంత్రి కనపడక పొతే మూడు రోజులు పట్టింది మన వాళ్లకు ఇంత టెక్నాలజీ వుంది కూడా..!! మరి అది హత్యో....!! ఏదో చేసిన చేయించిన వాళ్ళకే తెలియాలి...!!

జగన్ కి ఈ పది నెలల్లో ఈ ఆస్థులు అన్ని రాలేదు కదా!! మరి అమ్మ + నీతివాక్యాలు చెప్పే బాబులు అమ్మలు ఇప్పుడే నిద్ర లేచారేమో..!!

చెప్పాలంటే...... చెప్పారు...

వెన్నెల గారు అంత పెద్ద మాటలు ఎందుకు లెండి...మన ఇష్టం మనది

SNRK గారు అందరూ ఒకలా వుండరు కదండీ...ఎవరి ఇష్టం వారిది....మన చేతికి వున్న ఐదు వేళ్లు ఒకలా ఉన్నాయా..!! ఒక అమ్మకు పుట్టిన అందరూ ఒకేలా ఉంటారా...!!

నిజాన్ని ఒప్పుకోడానికి ధైర్యం చాలా కావాలి...!!

చెప్పాలంటే...... చెప్పారు...

మౌళి గారు ఓటు లేక పొతే రాజకీయాలు వుండవు కదా ఈ గోల వుండదు...

Mauli చెప్పారు...

@ఓటు లేక పొతే రాజకీయాలు వుండవు కదా ఈ గోల వుండదు...

మీకలా అనిపించినపుడు ఈ టపా, జగన్ కోసం ఆరాటం ఇవ్వన్ని అర్ధం లేని పనులు అవుతాయి :)

సరే , ఇప్పటి స్థితి మీకు నిజం గానే బాధ కలిగిస్తుంది. అర్ధం చేసికోగలం. కాని మీ ఆరోపణ 'ఎవరు అమ్మ గురించి మాట్లాడరు' అని అంటున్నారు. మీరు మాత్రం ఆమె గురించి ఎప్పటి నుండి మాట్లాడుతున్నారు????? మీకు జగన్ పై నమ్మకం లేదా, ఏదో ఒకటి చేసి బయటికి వస్తాడు కదా !

అసలు ఎవరిని అడుగుతున్నారు మీరు? ఇప్పుడు జనం కోసం ప్రభుత్వం జగన్ ని జైల్లో పెట్టిందా? జగన్ జనం కోసం జైలు కి వెళ్ళాడా? కాదు కదా.

కొద్ది మంది రైతులకు కాస్త ఊరట ఉంటుందేమో జీవో లు రద్దు అయ్యాయి కాబట్టి. అంటే వీళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు వస్తేనే కొన్ని సమస్యలు పరిష్కరించ బడుతాయి అన్న మాట.

మిగిలిన పార్టీ మిత్రపక్షాల మధ్య సయోధ్య కుదరకే కదా, కాంగ్రెస్ కి మెజారిటీ వచ్చింది. అప్పుడు మీరు బోలెడు సంతోషపడిపోయి ఉంటారు కదా ? ఇప్పుడు మేడం కి, జగన్ కి సయోధ్య కుదరలేదు. వాళ్ళే కుదుర్చుకుంటారు. మళ్ళీ అంతా మామూలవుతుంది. మీ మేళ్ళు మీకు జరుగుతాయి :)

మీ టపా శీర్షిక నే సక్రమం గా లేదు :)

చెప్పాలంటే...... చెప్పారు...

నేను ఎప్పుడూ రాజకీయాలకు దూరమే అండి..!!

జగన్ బయటకు రాదు అని అనుమానమే.. లేదు తప్పక వస్తాడు ...

జనం కోసం జగన్ జైల్లో పెట్టలేదు అధిష్టానానికి అడ్డు అని పెట్టింది మీకు తెలియడం లేదా అది...!!

వాళ్ళు ఈ రోజు కొత్తగా దోచుకున్నది లేదు మొదటి నుంచే అదే పని లో వున్నారు అప్పుడు కనిపించలేదా అందరికి ఇప్పుడు కొత్తగా తెలిసిందా..!! ఈ రోజు శ్రిరంగానితులు చెప్పే వాళ్ళు అందరూ తినలేదా..!!

అమ్మ సోనియా మేడం గారు మరి మీరు ఏ అమ్మ అనుకున్నారో..!!

తెలంగాణా అని గొడవలు రేపింది వాళ్ళు కాదా..!! వాళ్ళు బానే వున్నారు ఇబ్బంది పడే వాళ్లకు తెలుస్తుంది దాని బాధ ఎంతో..!!

నేను అనుకున్న పేరే పెట్టాను టపా సరిగానే రాశాను అని నాకు అనిపించింది....మీకు నాచక పొతే వదిలేయండి...-:)

మీకు ఇంకో విష్యం చెప్పాలి నేను జగన్ పార్టీ కాదు కాంగ్రెస్ కాదు తెలుగుదేశం కాదు జనం పార్టీ మధ్యతరగతి పార్టీ అండి...ఈ కుళ్ళు నచ్చకే ఓటు వేయను ఎవరికీ..!!

Mauli చెప్పారు...

ఇప్పుడు మీకేం కావాలో చెప్ప గలరా?

అజ్ఞాత చెప్పారు...

*ట్రూతు సీకరంట ట్రూతు సీకరు... అరవకుండా టూత్ పీకేయాలి.*

శంకరు నువ్వు నీ వంకరటింకర వాగుడు వాగడం ఆపు. ఎప్పుడు చూసినా తెగరెచ్చి పోతుంటావు. నువ్వు టూతు పీకే లోపు, నీ రెండు వరిగింజలను భూమిలో పాతిపెడతాం.

అజ్ఞాత చెప్పారు...

this SNKR is a parasite! he doesn't even have his own blog!!! but he comment on every blog, and mostly negatively!!


may be because of his jealousy, that he couldn't write, but others could! this guy must be deleted!

because, he would comment, virtually on any subject, like he is a god, then, why dont he write his own blog, if he knows so much??? this guy doesn't have that worth!!

for comments? they are open to everyone! right! so, he cashes!
this guy, based on his history, must be deleted immediately!!!

అజ్ఞాత చెప్పారు...

/he doesn't even have his own blog!!! but he comment on every blog, and mostly negatively!!/

హ్హ్వాహ్హ్వాహ్వా... అవునా!!!
ఏడవద్దురా బాబూ... ఏడిస్తే నీ కళ్ళ నీలాలు కారు, కారితే జగనొచ్చి బుగ్గలు ఎడాపెడా పిసికి ఓదార్చి చేతిలో ఓ జీడి పెట్టూ ... జో.. జో...
నీకు దమ్ముంటే బ్లాగ్ మార్తాండను ఒప్పించు, అదేజరిగితే నీలాంటి వెధవాయిలకోసమైనా ఓ బ్లాగ్ తెరుస్తా, పిచ్చ పిచ్చగా రెచ్చిపోదువుకాని. :))

Snkr ;)

ఆత్రేయ చెప్పారు...

అక్రమ సంపాదన ఎవరు పోగేసినా ఖండించాల్సిందే.
జగన్ అర్రెస్ట్ కోరుకునే వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఏ రాజకీయ పార్టీ ని సమర్ధించరు.
ఎవరైనా లంచాల ద్వారా, అవినీతి ద్వారా సంపాదిస్తే వాళ్ళందరూ శిక్షార్హులే.
రాజకీయ నాయకులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ...
సిబిఐ కి, ఏసీబీ కి దొరక పోతే వేరే విధంగా దేముడు దండిస్తాడు..
కుటుంబ అనారోగ్యం, అకాల దూర్మరణం, సంతాన విద్యా వైఫల్యం, మనో వ్యధ, అశాంతి ఇలాంటిదేదో వెంటాడుతూనే ఉంటుంది.
తస్మాత్ జాగ్రత !! జాగ్రత్త !!

అజ్ఞాత చెప్పారు...

pooripaka blaagu ee vankara gaadide

చెప్పాలంటే...... చెప్పారు...

అవును ఆత్రేయ గారు....థాంక్యు

చెప్పాలంటే...... చెప్పారు...

మౌళి గారు
నాకేం కావాలో మీరు చెయ్యగలరా చెప్పండి....!!

చెప్పాలంటే...... చెప్పారు...

దయ చేసి వ్యక్తిగత విమర్శలు చేయవద్దు....-:)

Mauli చెప్పారు...

@నాకేం కావాలో మీరు చెయ్యగలరా చెప్పండి....!!

మొదట మీరు చెప్పాలి కదా ఏమి కావాలి అన్నది.

అజ్ఞాత చెప్పారు...

praasanthanga swiss bank lo dabbulu vesukoka, mana rastram lo parisramalendukandi,
nijamga raajanna amayakude.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner