20, జూన్ 2012, బుధవారం
స్నేహమంటే....!!
స్నేహమంటే....!!
ప్రాణ స్నేహితులమని చెప్పుకోవడానికి మాత్రమే కాదు అవసరమైనప్పుడు చేతనైన ఆసరా కూడా ఇవ్వగలగాలి..
చిన్నప్పుడు ఏమి తెలియని కల్మషం లేని స్నేహం...!!
తరువాత పెరుగుతున్న కొద్ది...
చదువుకునే రోజుల్లో కొందరు...తరువాత ఉద్యోగ ప్రయత్నాల్లో కొందరు.. ఉద్యోగాల్లో...ఇంటా బయటా...ఇలా...
చాలా మంది మన జీవితంలో తారసపడతారు కాని అన్ని స్నేహాలు కలకాలం వుండవు...
కొన్ని స్నేహాలు మాత్రమే చిరకాలం స్నేహ సౌరభాలు వెదజల్లుతూనే వుంటాయి...!!
మన అవసరాన్ని బట్టి కూడా స్నేహాలు మారి పోతూ వుంటాయి.
సాయం చేయగలిగిన స్థితిలో వున్నప్పుడు సాయం చేయడం లో తప్పు లేదు...!!
కాకపొతే చేసిన సాయాన్ని మర్చిపొతే...?? స్నేహాన్ని మర్చిపోతే..??
స్నేహానికి అర్ధమే వుండదు....!!
జీవితం లో మంచి చెడు ఉన్నట్లే స్నేహం లో కూడా వుంటుంది...!! కాకపొతే చెడుని ద్వేషించినట్లుగా
స్నేహాన్ని ద్వేషించలేము...!! ఆదే స్నేహం గొప్పదనం..!! ఎంత కాదనుకున్నా ఎప్పుడో ఒకసారి గుర్తుకు రాని స్నేహం వుండదేమో..!! అదేనేమో స్నేహ బంధం గొప్పదనం....!!
అందుకే స్నేహానికన్న మిన్న లోకాన లేదు....!!
(నా హితులకు...సన్నిహితులకు...స్నేహితులకు... స్నేహానికి ప్రాణమిచ్చే అందరికి ఈ టపా అంకితం..!!)
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నిజమే జీవితంలో స్నేహం చాలా మధురమైనది, కొన్ని కొన్ని స్నేహాలు చేదుగా మిగిలిపోయినా అవి మొదలయినప్పుడయినా తియ్యగానే మొదలయి ఉంటాయి...
తీపయినా చేదయినా స్నేహం గుర్తే కదా...!! థాంక్యు
sneham eppudu snehame,
chakkaga chpparu.
keep writing.
Very nice post manju gaaru.
మంజు గారు... చాలా బాగా చెప్పారండీ...
ఈ లోకంలో అన్నింటికన్నా స్నేహ బంధమే గొప్పది..
సీతని రావణాసురుడు తీసుకుపోయినపుడు, రామునికి అండగా నిలిచి, సీతని రాముని వద్దకు తిరిగి చేర్చింది.. సుగ్రీవునితో చేసిన మైత్రీ బంధం కాక మరేంటి ? అంతగొప్పది స్నేహబంధం..
చక్కని పోస్టు..
ఎక్కడో చదివిన జ్ఞాపకం...
" a friend who postpone self funeral for friendship is a real friend"అని.
సేహ బంధమూ ఎంత మధురమూ ! అంటూ
మీ టపాని మేచ్చేసు కుంటు న్నానండీ...
అందుకే మీ బ్లాగ్ లో చేరిపోతున్నానండీ!:-)
@శ్రీ
భాస్కర్ , వెన్నెల ,సాయి, శ్రీ ..
నా టపా నచ్చిన మీ అందరికి నా ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి