24, జూన్ 2012, ఆదివారం

వదలి పోనంటోంది .....!!

సడి లేని నా గుండె గూటిలో...
ఆనంద సరాగమై వచ్చావు...!!
విరచిత కవనమై విరాజిల్లినావు...!!
మరచిన ఆశలను మరల మేల్కొలిపావు ...!!
మనసు లేదనుకుంటే...నా మది నిండా...
నీవే నిండి వున్నావు...!!
వద్దు పొమ్మన్నా పోనంటున్నావు...!!
జ్ఞాపకాలు కలల అలలై కమ్ముకుంటే...
ఆ కమ్మదనంలో....నువ్వే వున్నావు...!!
నా నుండి మనసును విడదీసి ...
నిను పొమ్మని అందామంటే...!!
మనిషిని పోయినా మనసు లోని
జ్ఞాపకం నను వీడి పోనంటోంది....!!
అచ్చం నీలానే..!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Meraj Fathima చెప్పారు...

emi cheppanu vaddanna vinakundi naaa manasu malli malli mee kavithe chadavaalantundi. chaalaa baaga rasaru.

the tree చెప్పారు...

chakkaga raasaarandi.

జలతారు వెన్నెల చెప్పారు...

జ్ఞాపకాల వలలోంచి తప్పించుకోవడం కష్టం మంజు గారు.

శ్రీ చెప్పారు...

మనసు నిండా నింపుకున్నాక...
పొమ్మంటే పోదు కదండీ!
చిత్రంతో సహా చాలా బాగుంది...
@శ్రీ

సీత చెప్పారు...

chaala baagumdi .....manju gaaru..
very very nice..:)

చెప్పాలంటే...... చెప్పారు...

శ్రీ , ఫాతిమా గారు , భాస్కర్ , వెన్నెల, సీత, అందరికి నా కవిత నచ్చినందుకు చాలా సంతోషం గా వుంది ధన్యవాదాలు.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner