27, జూన్ 2012, బుధవారం
ఎక్కడా లేని వింత...!! మనకు మాత్రమే...సొంతం !!
ఈ వింత విన్నారా..!! ఎప్పుడో వాడుకున్న కరంట్ కి ఇప్పుడు డబ్బులు కట్టాలంట..!! పావలా వడ్డీలు , ఆ శ్రీలు ఈ శ్రీలు అని మనలను మాయలో ముంచి ఆకుకూరల దగ్గర నుంచి పెంచిన ధరలు ఆకాశానికి ఎగిరితే....!! పండిన పంటకు గిట్టుబాటు ధరకు ధర్నాలు చేసినా కనీస ధర కూడా కట్టలేని మన ప్రభుత్వం...మరి ఈ కరంటు గోల ఏంటో..!! ఇక నుంచి
పీల్చే గాలికి , అమ్మ పాలకి కూడ పన్ను కట్ట మంటుందేమో..!! మద్య తరగతి జీవితాలు ఏమవ్వాలో...!!
ఓటు కోసం మాటలు చెప్పే నాయకులను వెలి వేయాలి.... ఏ రాజకీయ పార్టి ని గెలిపించక పొతే..!! మనం ఊరుకున్నంత వరకు నాయకులు మన జీవితాలతో ఇలా ఆడుకుంటూనే వుంటారు. దొరికినంత భోంచేసి ఖజానా ఖాళి అంటూ పన్నుల భారం మన నెత్తిన వేస్తున్నారు...!!
ఎన్నికలను బహిష్కరిస్తే...ఎలా వుంటుంది...?? దూకుడు రాజకీయాలు, భజన రాజకీయాలు , భోజన రాజకీయాలు, ఇలా అన్నిటికి కాస్త కళ్ళెం వేయవచ్చేమో...!! అప్పుడయినా ఓటు నోటుకి అమ్మడు పోకుండా ఓటు తూటా లా మారితే మన నాయకుల కుతంత్రాల రాజకీయాలకు తెర పడుతుందేమో..!!
2009 లో వాడిన కరంట్ కి ఇప్పుడు బిల్లు వేస్తారంట. ఏదో సామెత చెప్పినట్లు అమ్మ పొట్టలో వున్నప్పుడు నీకు ఇంత ఖర్చు పెట్టాను ...అని అన్నట్లు గా వుంది. ఓ తమ్ముడు అన్నకి నీ పుట్టుకకి బోల్డు ఖర్చు పెట్టాను అని చెప్పినట్లుగా...!!
ఇలా వాళ్ళు వేస్తూ వుంటే మనం కట్టుకుంటూ పోతుంటే....దరి అంతు వుండదేమో..!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
"మహానేత" సువర్ణ పాలన ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం.
అది జనాలందరికీ తెలియాలి కదా రవీంద్ర గారు :)
నిజమే మీతో నేనూ ఏకీభవిస్తున్నాను.. ఒకసారి ఈ ఎన్నికలని బహిష్కరిస్తే అప్పుడు తెలుసొస్తుంది..
ఐదు ఏళ్ల కని ఎన్నుకుంటున్నాము కాని ఈ మధ్యలోనే ఎన్ని సార్లో ఎన్నికలు.. ఆ ఖర్చులు అన్ని మన మీదే..!!
ఒక పార్టి కానీ ఎన్నుకుంటే మళ్ళి వేరే పార్టి లోకి పోతారు మళ్ళి ఎన్నికలు...చేసే పని ఏమి వుండదు వాళ్ళు దోచుకోవడం తప్ప...!! అందుకే అందరూ ఊక సారి ఎన్నికలు బహిష్కరించాలి....!!
థాంక్ యు శుభ గారు నాతొ ఎకిభవిన్చినందుకు
billu kattadam thappa emi cheyalemu.
currunt shack koduthune untundi.
అవును భాస్కర్ గారు మనం బిల్లు కట్టడమే చేయగలం :) కరంట్ షాక్ కి తట్టుకోలేము కదా మరి...!!
Surprised! Is this true?
నిజమేనండి జులై నుంచి అంటున్నారు చూద్దాము మరి....
ilaa enno annitinee edurkovaali andaram kalasi kattuga
కలవాలి కదండీ ఫాతిమా గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి