ఎర్ర బస్సెక్కి ఇంజనీరు అయిపోదామని వచ్చేసి మొత్తానికి ఇంజనీరునైపోయి....అలానే నాన్న ఫ్రెండ్ నరసరాజు అంకుల్ పుణ్యమా అని టికెట్ కుడా అంకులే తీసుకుంటే ఎయిర్ బస్సు ఎక్కి అమెరికాకి కుడా ఎల్లోచ్చేసాను...కాకపొతే అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది ఎర్ర బస్సెక్కిన మనమేనా ఇన్ని చేసింది అని బోల్డు ఆశ్చర్యం కుడా వేసేస్తూ వుంటుంది....చెన్నైలో విమానం ఎక్కాను అని తెలియకుండా ఎక్కేసాను.. విమానం కిటికీ లో నుంచి ఆకాశం చూడటం తో మొదలు పక్కన అమ్మాయి సాయం తో మొత్తానికి అమెరికాలో కాలు పెట్ట్టాను...అన్నయ్య ఎయిర్‌పోర్టు కి వచ్చి కార్ సీట్ బెల్టు పెట్టుకోవడంతో మొదలు ఇంటికి తీసుకు వెళ్లి ఆన్ని చెప్పడం స్టేట్ ఐడి కోసం తీసుకు వెళ్ళడం.. ఎస్కలేటర్ ఎక్కడానికి దిగడానికి మన్మధుడు లో బ్రమ్మానందం లా కాస్త పడుతుంటే...అన్న కూతురు సుమీ నవ్వడం...నా కోసం వాళ్ళు తెలుగులో కస్టపడి మాట్లాడటం ..భలే బావుండేది...ఒక వారం తరువాత కంపెని గెస్ట్ హౌస్ కి పంపడం కావాల్సినవి కొని పెట్టి....కాక పొతే అసలైన బియ్యం మర్చిపోయాము కొనడం...ఒక్కళ్ళమే వుండటం భయం భయం గా....హాల్లో సోఫాలో పడుకుని బ్లైండ్స్ లో నుంచి చూడటం నిద్ర లేకుండా....పొద్దున్నే ఎండ చూసి అబ్బో ఎండా అని సంబరపడి తీరా ఎండలోకి వెళ్తే చలి...!! మొదటగా ఒక ఆమె వచ్చింది ఎంతసేపు ఫోను వదలకుండా వుండేది...నాకేమో ఏమిలేదు తరువాత ఒక ఫామిలి వచ్చారు....బానే వుంది వాళ్ళతో...వాళ్ళ కోసం వచ్చి నాకు ఫ్రెండ్స్ అయ్యారు సిరి సీతారాం. కాక పొతే మొదటి ఆమెతో పడలేక అన్నయ్యకు ఫోన్ చేస్తే వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఒక పది రోజుల్లో మొత్తానికి చికాగో వెళ్ళాను....అన్నట్టు మొదటగా అమెరికాలో కాలు పెట్టింది వాషింగ్టన్...బాల్టిమోర్ అన్న వాళ్ళ ఇల్లు..పారాడైం కంపెనీ గెస్ట్ హౌస్ లో కస్టాలు...అవసరానికి డబ్బులు ఇచ్చిన నరసరాజు అంకుల్ ... అది అక్కడికి.
అమెరికా వెళ్ళిన తరువాత నేను ఒక్కదాన్నే అని అనుకోకుండా నన్ను భయపడనీకుండా రోజు ఫోను చేసి మాట్లాడిన సతీష్...నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి తెసుకు వెళ్లి కంపర్ట్ కొని పెట్టిన కళ్యాణ్ వాళ్ళ వైఫ్ ...విని రమేష్ యశోద అన్నయ్య వాళ్ళ ఇంట్లో కలవడం...థాంక్స్ గివింగ్ కి సిరి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తే అన్నయ్య వచ్చి ఇంటికి తెసుకువెళ్ళడం...తరువాత చికాగో ప్రయాణం నాకు కొత్త అని ఫ్లైట్ గెట్ వరకు వచ్చి ఎక్కించిన సుమీ కృష్ణ....పది అడుగుల స్నో లో చికాగో లో కాలు పెట్టడం కాబ్ ఎక్కడం పాపం నేను మోయలేను అని కాబ్ డ్రైవర్ నా సూట్‌కేస్‌లు తేవడం ...ఏమి తెలియని నేను అలా అలా కాస్త కాస్త అలవాటు కావడం....
చికాగో లో హెచ్ ఎన్ సి లో ట్రైనింగ్ పీపుల్ సాఫ్ట్ లో...వినయ్ గారు మంజుల గారు బ్రమ్మయ్య కైలాష్ షన్ముఖ్ మూర్తి ఇంకా కొంత మంది పరిచయాలు...నా పుట్టిన రోజుకి కొద్ది పరిచయం లోనే కేకు తెచ్చి సెలబ్రేట్ చేసిన అందరు...అది ఐయ్యాక కార్సన్ సిటి లో మొత్తానికి ఉద్యోగం వచ్చింది వి సి ++ లో లెండి....చికాగో నుంచి ప్రయాణం మద్యలో ఫ్లైట్ మిస్ ఐయ్యి ఒంటారియో లో వుండటం ఆకలికి ఏమి తినాలో తెలియని పరిస్థితి లో పిజా తినడం ...మరుసటి రోజు రెనో లో దిగి కాబ్ లో కార్సన్ సిటి కి వెళ్ళడం ...అబ్బు రూము లో నాలుగు రోజులు సంపత్ ఇంట్లో మద్యానం భోజనాలు ..కోక్ అలవాటు లేని నేను టిన్ బాగ్ లో అలానే వుంచడం ...సంధ్య శ్రీనివాస్ శ్యాం పరిచయాలు...తరువాత కాలే కుటుంబం తో ఒక నెల రోజులు షేర్ చేసుకుని ఉండలేక మల్లి వేరే రూము లోకి మారి పోవడం రోజు సంపత్ జీప్ లో వెళ్ళడం మద్యానం మా ఇంట్లో భోజనం ఇలా బానే వుండేది. కైలాష్ ఫ్రెండ్ నాకు ఫోను లో హెల్ప్ చేసేవాడు వి సి ++ లో....కొత్తగా వెళ్ళినప్పుడు కొద్ది పరిచయం లో డబ్బులు కావాలేమో అని కుడా అడిగిన మొదటి వ్యక్తీ కైలాష్..!!
మరి కొన్ని కబుర్లు మళ్లి ఎప్పుడైనా.....
5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
హ,హ...బాగున్నాయ్ అండి..మీ కబుర్లు...
baagunnaayi manju gaaroo! me america kaburlu...:-)
@sri
haah fine madam navukuntu!!!
Miru superandi asalu.
-:) అంతే అంటారా....!!
థాంక్యు అండి అందరికి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి