25, అక్టోబర్ 2012, గురువారం

గుర్తు వచ్చిన మధుర క్షణాలు....!!

నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు....ఓ రెండేళ్ళ పాపాయి నాకు మంచి నేస్తం....!! ఆడినా పోట్లాడినా ఎక్కువగా నాతోనే...మా ఎదురు ఇంట్లో ఉండేవాళ్ళు. నాకేమో అమ్మాయిలంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి....పసిపిల్లలను కుడా అబ్బాయిలను ఎత్తుకునేదాన్ని కాదు....-:)  పాపాయి వాళ్ళ అమ్మ..అబ్బాయిలు అస్సలు ఇష్టం లేదు కదా మరి నీకు అబ్బాయిలైతే ఏం చేస్తావు అంటే నీకిచ్చేస్తాను  అన్నా..!!    
ఈ రెండేళ్ళ పాపాయి వాళ్ళ అక్క చదివే పాఠాలు విని గడ గడా చెప్తూ భలే హుషారుగా ఉండేది...అందరు అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వుంటే  పాపాయి నా దగ్గరకే వచ్చేది...అసలు విష్యం ఏంటంటే మొన్ననే ఆ పాపాయికి బుల్లి పాపాయి పుట్టింది...నా నేస్తం ఇప్పుడు పాపాయి కాదులెండి పెద్దది అయిపొయింది...స్కూలులో పాఠాలు చెప్పే పంతులమ్మ కూడా..!!
చూడటానికి ఇంటికి వెళ్తే అనిపించింది నాతో ఆడి పోట్లాడిన ఆ పిల్లేనా అని..!! రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయా అనిపించింది....నేను  తెలిసిన మా  వాళ్ళు కూడా నన్ను ఇలానే అంటూ వుంటారు....నేను
కూడా బానే అల్లరి చేసేదాన్ని , పోట్లాదేదాన్ని..కబుర్లు కూడా బాగా చెప్పేదాన్ని...!! మా పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తూ వుంటారు...బొమ్మలు ఎన్ని వున్నా ఇంకా కొనమంటే నేను వాళ్ళను తిడితే మా అమ్మ వెంటనే నువ్వు నీకు  నచ్చిన బొమ్మ ఇచ్చే వరకు ఊరుకోలేదులే....ఎవరింటికో వెళ్తే వాళ్ళ ఇంట్లో బొమ్మ చూసి అదే కావాలని పేచి పెట్టి మరీ బొమ్మ తీసుకున్నావు...దాన్ని వెంటనే పాడుచేసావు...మరి వాళ్ళనెందుకు తిడతావు అని నా మీద పోట్లాటకు వస్తుంది... ఇక నా కొడుకులకు పండగే మా అమ్మ నన్ను తిడుతూ వుంటే..!!
చిన్నప్పటి కబుర్లు ఇలా ఎవరైనా గుర్తు చేస్తూ వుంటే భలే బావుంటుంది కదూ.....!! 

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

మాలా కుమార్ చెప్పారు...

అవును . ఎవరికైనా అవి మధురస్మృతులేకదా :)

భాస్కర్ కె చెప్పారు...

హ,హా,నిజమేనండి. నన్ను తిడితే మా ఆవిడకి కూడా ఆనందం......

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు మాలా గారు , భాస్కర్ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner