19, ఫిబ్రవరి 2013, మంగళవారం
మన పెత్తనం....!!
ఎవరికి ఎవరి మీదైనా ఇష్టం కాని...కోపం కాని...దానంతట అదే రావాలి...అంతే కాని ఒకరు చేప్తే వచ్చేది కాదు..ఇష్టం కోపం అనేది...మనసులో నుంచి రావాలి...!! పెద్దవాళ్ళం కదా అని పిల్లల మీద పెత్తనం చెలాయించాలంటే ఒకసారి రెండుసార్లు వీలౌతుంది...మూడోసారి ఎదురుతిరుగుతుంది...మన పెత్తనం.....!!
మనసులోని ఇష్టాన్ని, కోపాన్ని..మనం తుడిచివేయలేము బలవంతంగా...!! అన్ని మనకు నచ్చినట్లే ఉండాలి అనుకుంటాము కాని మనతోనే ఉంటున్న మిగతావాళ్ళకి కనీసం కాస్త అయినా నచ్చాలని అనుకోము. ఎందుకో అందరమూ కొద్దిగానైనా హిట్లర్ స్వభావాన్ని ఆపాదించుకున్నామేమో అని అనిపిస్తోంది.
తప్పులు వెదుక్కుంటూ పోతే అన్ని తప్పులే కనిపిస్తాయి ఎప్పుడూ....కాస్తయినా మంచి ఆలోచనలు చేస్తే ఎదుటి వాళ్ళలో మంచి కనిపిస్తుంది...అలా అని అందరు మంచి వాళ్ళే అని అనను కాని అందరు చెడ్డ వాళ్ళు కాదని మాత్రం చెప్పగలను....నా అనే స్వార్ధం ఉండటంలో తప్పు లేదు కాకపొతే అప్పుడప్పుడు మన అని కూడా అనుకుంటే బావుంటుంది...మనం బావుండాలి మనతోపాటుగా అందరూ బావుండాలి...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అందరు మంచి వాళ్ళే అని అనను కాని అందరు చెడ్డ వాళ్ళు కాదని మాత్రం చెప్పగలను.... Nice one :)
:) Thank U Kranthi garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి