4, మార్చి 2013, సోమవారం

హృదయ సంఘర్షణ....!!

పెంచుకున్న అనుబంధం
ఒక్కసారిగా దూరమైతే....!!

మరచిపోలేని మనసు ఆరాటం
మాటలకందని మూగ వేదనే...!!

కనిపించదేమో అనుకున్న రూపం
కనుల ఎదుట సాక్షాత్కారమైతే...!!

మాట రాని మనసు ఆనందం
మోమున ప్రతిఫలిస్తుంటే...!!

 చెప్పలేని సంతోషం వెల్లివిరిస్తే
క్షణంలో దగ్గరై....మరుక్షణమే దూరమైతే...!!

చెప్పలేని హృదయ సంఘర్షణ
ఆ ఇరు మనసులకే ఎరుక....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner