కొన్ని సార్లు అందరూ ఉన్నా...అన్నీఉన్నా...మన అనుభూతిని పంచుకోవడానికి...మన అంటూ ఏది లేదు...ఎవరు లేరు అనిపిస్తే....!!
మనకున్న డబ్బు వీటిలో దేనిని తెచ్చి ఇవ్వలేదు...అర్ధంలేని స్నేహాలు...అరా కాణి ప్రేమలు ఎందుకు కొరగావు...ఏదో మన టైంపాస్ కి తప్ప..!!
అనుబంధాలు...అనురాగాలు కూడా ధనం చుట్టూనే తిరుగుతున్నాయి....డబ్బు బంధాలై పోతున్నాయి...!!
మాటలు కూడా ఖరీదు గానే ఉంటున్నాయి...మనం ఏదైనా ఫంక్షన్ కి వెళితే...ఇంత ఖర్చు ఐనదంట ఈ ఫంక్షన్ కి... ఆవిడ చీర ఎంత ఖరీదో తెలుసా....ఆ నక్లెస్ ఎంత బావుందో....!! మీ అమ్మాయి అమెరికాలో ఉందంటగా...!! మా అబ్బాయి అక్కడే పేద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడులెండి...ఇలా ఉంటాయి కొన్ని...మరికొన్నేమో నా సాలరీ ఇంత....అంతా నేనే చూసుకుంటాను...అంటూ కాస్త హై..ఫై..ల్లో అస్సలు తెలుగే తెలియనట్లు మాటలు...!!
ఏంటో మరి వేసుకున్న నగలకి...చీరలకి...చేసే ఉద్యోగాలకి....ఇలా వీటికి మాత్రమే విలువలు ఇస్తూ పోతున్నారు...అంతా పై పై ప్రేమలు ఒలకపొయడమే....!! మనిషి వ్యక్తిత్వానికి విలువ ఇచ్చే రోజు ఎప్పుడు వస్తుందో....!! ఏమో...!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఆవేదన,సమంజసంగా ఉంది. ప్చ్.. ఏమి చెప్పగలను. !!?
manishi ki value ichhi rojulu inka ravu le andi
:) అవును కదా వనజ గారు
శివా..-:)
ఆ రోజులు వస్తాయని చూద్దాం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి