వివాహ బంధాన్ని పంచుకునే ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని మన పెద్దల ఉవాచ. సరిజోడి కాకపోయినా పర్వాలేదు కాని సరిపెట్టుకునే మనసు ఉంటె చాలు. అర్ధం చేసుకోలేక పోయినా పర్లేదు అగాధాన్ని పెంచకుండా ఉంటే అదే పదివేలు( ఇప్పుడు పది లక్షలు అనాలి కాబోలు). అప్పటిలా ఏడు తరాలు చూడలేక పోయినా కనీసం వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళకు ఇంట్లో వాళ్ళతో ఉన్న అనుబంధం, బాధ్యతలు అయినా చూసుకుంటే కాస్తయినా బావుంటుంది. అమ్మానాన్నలతో ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది అబ్బాయికయినా అమ్మాయికయినా. మనసుకు తగిన మనిషి దొరకనప్పుడే జీవితం విలువ ఏంటో తెలుస్తుంది....!! మనం ఏం కోల్పోయామో అర్ధం అవుతుంది....కాకపొతే అప్పటికే అంటే.....మనకు తెలిసే సరికే ఓ జీవితకాలం ఆలస్యమై పోతుంది....!! అందుకే తొందరపడి ఓ నిర్ణయానికి రాకండి...!! నిర్ణయం తీసుకున్న వాళ్ళకు కొత్తగా చెప్పేదేం లేదు ఆల్రెడీ అలవాటై పోయి ఉంటుంది. జీవితం చాలా విలువైంది తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోకండి మంచి జీవితాన్ని కోల్పోకండి....!!



చెప్పని కధలో గురుతుగా ఉన్నా
