20, మార్చి 2013, బుధవారం

నువ్వొస్తావని....!!

జారిపోతున్న కన్నీరు చెప్పలేక పోతోంది
నీ ఉనికి జాడ ఎంత వెదికినా తెలియలేదని...!!
రెప్ప పడితే....!!
ఆ క్షణమే నీ రూపం
కనుమరుగౌతుందని భయంతో
మూయలేని కనురెప్పల తాకిడితో
ముంచుకొస్తున్న నిదురమ్మను
మళ్ళి రమ్మని సాగనంపుతూనే ఉంది
నీ కోసం ఎదురు చూస్తూ....!!
ముసిరిన చీకటిలో
రేచుక్కల సాయంతో
అందరిని అడుగుతూనే ఉంది
నీ జాడ తెలుపమని...!!
వేకువ పొద్దుకైనా....
నువ్వొస్తావని ఎదురు చూస్తోంది....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని చెప్పారు...

very nice Manju gaaru

Unknown చెప్పారు...

చాలా బావుంది... మీకు ధన్యవాదాలు...

మీకు సమయం దొరికినపుడు మా బ్లాగ్ ను కూడా ఒక చూపు చూడండి. :)

ధన్యవాదాలు,
తరుణ్,
www.techwaves4u.blogspot.com (తెలుగు లో టెక్నికల్ బ్లాగు )

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u Vanaja garu
Thank u Tarun garu
TAppaka chustanu mi blog

చెప్పాలంటే...... చెప్పారు...

chala baavundi mi blog akkada comment pettadaaniki kudaraledu useful info chalaa baagaa echaru Thanks

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner