26, మార్చి 2013, మంగళవారం

వేదన...ఆవేదన....!!

గుండెకు గాయమైంది
మనసుకు మరణయాతన దగ్గరైంది
చేతన లేని శరీరం సహకరించనంటోంది
కలలు కనే కళ్ళకు భావాల.... 
స్పందన ఉన్నా భాష లేదు చెప్పడానికి
అన్ని తెలిసినా చెప్పలేని నిస్సహాయత   
అర్ధం చేసుకునే మనసులు ఎక్కడో మరి...!!
తెలుసుకునే సరికి చేజారిపోతోంది జీవితం
అన్నిటిని మోసుకుంటూ
ఎవరితో నిమిత్తం లేకుండా
కాలం పరుగెత్తి పోతూనే ఉంది...!!
ఏమిటో ఈ రెప్పపాటు జీవితం...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జయ చెప్పారు...

అంతా కాల మహిమ. బాగా చెప్పారండి.

చెప్పాలంటే...... చెప్పారు...

:) థాంక్యు జయ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner