28, మార్చి 2013, గురువారం

ఏ జన్మ బంధమో....!!

చెప్పని కధలో గురుతుగా ఉన్నా
చెరగని ముద్రగా మారింది....!!
చెదిరి పోయిన నుదుటి రాతలో
చెక్కు చెదరని  జ్ఞాపకమైంది....!!
ఎప్పటికి చెప్పని మాట
ఎవరికీ వినిపించని గొంతు 
గాలిలో తేలుతూ నన్నే చేరుతోంది....!!
అది నిన్నే నిన్నే గురుతు తెస్తోంది...!!
పదే పదే పలకరించక పోయినా
ప్రాణం నీవే అంటోంది....!!
మరపు లేని మనసులో
మూగ తలపు మౌనమైంది...!!
ఏ జన్మ బంధమో ఈ అనుబంధం...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

sivaprasad చెప్పారు...

good one

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u Siva :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner