బతికేస్తాం కాని....అదే నిజమని భ్రమలో అసలు నిజాన్ని మర్చిపోయామని మర్చిపోతాం...ఎందుకంటే నిజంగా నిజాన్ని తట్టుకోలెం కనుక. ఉన్న కాస్త జీవితాన్ని కష్టపెట్టే నిజంలో బతకడం అవసరమా...!! అయినా ఎందుకో కొందరేమో కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తారు....మరికొందరేమో అబద్దపు అంచులలోనే ఆనందాన్ని వెదుక్కుంటారు...!! అదే నిజమైన సంతోషమని వాళ్ళు నమ్ముతూ ఎదుటివారిని కూడా నమ్మించాలని ప్రయత్నిస్తారు....!! కష్టమైనా నిజంలో బతకడంలో ఉన్న సంతృప్తి, ఆత్మతృప్తి....కలలాంటి కల్లలో బతకడంలో ఎప్పటికి వస్తుంది?
పెద్దలన్నట్టు కాకిలా కలకాలం బతికే కన్నా హంసలా అరక్షణం బతికినా చాలు....అదే నిజానికి అబద్దానికి మధ్యలో తేడా...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి