30, మార్చి 2013, శనివారం

జీవితాన్ని కోల్పోకండి....!!

వివాహ బంధాన్ని పంచుకునే ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని మన పెద్దల ఉవాచ. సరిజోడి కాకపోయినా పర్వాలేదు కాని సరిపెట్టుకునే మనసు ఉంటె చాలు. అర్ధం చేసుకోలేక పోయినా పర్లేదు అగాధాన్ని పెంచకుండా ఉంటే అదే పదివేలు( ఇప్పుడు పది లక్షలు అనాలి కాబోలు). అప్పటిలా ఏడు తరాలు చూడలేక పోయినా కనీసం వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళకు ఇంట్లో వాళ్ళతో ఉన్న అనుబంధం, బాధ్యతలు అయినా చూసుకుంటే కాస్తయినా బావుంటుంది. అమ్మానాన్నలతో ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది అబ్బాయికయినా అమ్మాయికయినా. మనసుకు తగిన మనిషి దొరకనప్పుడే జీవితం విలువ ఏంటో తెలుస్తుంది....!! మనం ఏం కోల్పోయామో అర్ధం అవుతుంది....కాకపొతే అప్పటికే అంటే.....మనకు తెలిసే సరికే ఓ జీవితకాలం ఆలస్యమై పోతుంది....!! అందుకే తొందరపడి ఓ నిర్ణయానికి రాకండి...!! నిర్ణయం తీసుకున్న వాళ్ళకు కొత్తగా చెప్పేదేం లేదు ఆల్రెడీ అలవాటై పోయి ఉంటుంది. 
జీవితం చాలా విలువైంది తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోకండి మంచి జీవితాన్ని కోల్పోకండి....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

satya చెప్పారు...

మీరు చెప్పింది ముమ్మాటికి నేను యేకిబవిస్తాను .
జీవిత బాగస్వామి అంటే పెళ్లి అయిన తరువాత రోజు నుంచి దేహం విడిచే వరకు వారితోనే వుండాలి కాబట్టి నిర్ణయం తెసుకోనేతప్పుడే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాలి ..

చెప్పాలంటే...... చెప్పారు...

అవును సత్య గారు మీరు చెప్పింది నిజం ధన్యవాదాలు మీ స్పందనకి

అజ్ఞాత చెప్పారు...

@మనకు తెలిసే సరికే ఓ జీవితకాలం ఆలస్యమై పోతుంది..

అప్పటికే నరకం ప్రత్యక్షమవుతుంది గా వాళ్ళకు...సర్దుకు పోదాం అని ఎంత సరిపెట్టుకున్నా, నరకం చూపించే పార్ట్నర్ అయితే చావే..

చెప్పాలంటే...... చెప్పారు...

:) You are Correct andi Kvsv garu

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner