మీదైనా కోపం వస్తే రాస్తాను అది....ఇది...అనుకున్నట్లుగా ఉంది...నేను కోపాన్ని మాత్రమే కాదు పంచుకునేది బ్లాగులో నా ప్రతి ఆలోచనని అక్షర రూపంలో నాకు అందుబాటులో ఉన్న పదాలతో వ్యక్తికరిస్తున్నాను. నాకు తెలియని ప్రపంచాన్ని చూపించిన అనుభవాలు...అనుభూతులు...బాధ...కోపం...ఆవేశం....ఆక్రోశం..సంతోషం....ఇలా ప్రతి చిన్న అనుభూతిని పంచుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళు చదవచ్చు....లేని వాళ్ళు చూడనే వద్దు...అంతే కాని నవ్వులాటగా నా రాతల్ని మార్చకండి దయచేసి. ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్లేదు కాని అపహాస్యం చేయకండి.
రాయడం అనేది కూడా దేవుడిచ్చిన ఒక వరమే....!! రాతల్లో జీవితార్ధాన్ని చూడలేని వారికి ఏ రాతల విలువా తెలియదు. దిగ్రీలు ఉండొచ్చు...సొమ్ములు కూడా బోలెడు ఉండి ఉండొచ్చు....కాని మనకు లేని లక్షణం ఎదుటి వారిలో ఉంటె అభినందించే మంచి మనసు మాత్రం కొందరికే సొంతం...!! ఒకప్పుడు పుస్తకాల విలువ ఎంతో ఉన్నతం. పుస్తకం చదివినా రాసినా చాలా గొప్పగా ఉండేది...ఇప్పటి రోజుల్లో పుస్తకాలు ఎంతమంది చదువుతున్నారో వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు. ఇక రాతల్లో అనుభూతిని ఎలా పొందగలరు? పది మందిలో అపహాస్యం చేయడం తప్ప...!! మరి ఈ జ్ఞాన సంపన్నులు ఎంత గొప్పవారో వారి వెనుక ఉన్న సొమ్ము చెప్పాలి లేదా వాళ్ళ నెరిగిన వారు చెప్పాలి....!!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి....అభినందించే మంచి మనసు కూడా ఉండాలి....!! మరి ఎంత మందికి ఉందో ఆ మంచి మనసు....-:).
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
వ్రాసే ప్రతి అక్షరం వెనుక మది ని మధించే తలపులు ఆలోచనల నిగ్గు తేల్చే నిజాలు ఉంటాయి భావావేశాలు అందరికి సహజమే! మీదైన తీరులో మీరు వ్రాసుకున్తున్నది మీ బ్లాగు లో అందుకు ఎవరికీ అభ్యంతరం ఉంటుంది ?
బ్లాగ్ డైరీ లాంటిది కీప్ రైటింగ్ మంజు గారు . నవ్వుకునేవాళ్ళని నవ్వుకోనీయండి మనం ఇంకా నవ్వుకుందాం :) :)
Nenu anukunnade miru chepparu Vanaja garu Thank u So much
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి