5, ఏప్రిల్ 2013, శుక్రవారం

నీ చెలిమి సుమ గంధం....!!

బెదిరి చెదిరిన బతుకులో
గాలి వాటుగా వచ్చి చేరింది
చల్లని పిల్లతెమ్మెర లాంటి
నీ చెలిమి....!!

అలసిన మనసుకి ఆలంబనై
చెంత చేరి...సేద దీర్చి...
చేయూత నిచ్చింది
నీ చెలిమి....!!

కన్నీటి కోనేటి సంద్రాన్ని
పన్నీటి జల్లుగా మార్చి
నీ జ్ఞాపకాల గుభాళింపులతో
వర్తమానాన్ని పరిమళ భరితం చేసింది
నీ చెలిమి....!!

చలనం లేని చేజారిన జీవితాన్ని
ఉల్లాసంతో గగనంలో గమనంలా
అందని చందమామను సైతం
అందుకుంటానన్న ఆశను రేపి
ఆకాశంలో విహారం చేయించింది
నీ చెలిమి....!!

నువ్వు వీడి పోయినా
నను విడిచి పోనంటోంది
నీ చెలిమి సుమ గంధ పరిమళం ....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...

" చెలిమి " బలిమి కలిమి కంటే ఎంతో బలమైనది, విలువైనదని చక్కగా చెప్పారు .
బాగుంది.

శర్మ జీ ఎస్

Unknown చెప్పారు...

మంజు గారు మీ చెలిమి సుమగంధ పరిమళం అమోఘం

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు శర్మ గారు, రమేష గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner