18, ఏప్రిల్ 2013, గురువారం

అసలైన ఉగాది....!!

ఏవి ఆనాటి ఉగాది సౌరభాలు....?
కమ్మని వేప పూల సుగంధాలు
పుల్లని మామిడి పిందెల కమ్మదనాలు
పంచదార చెరుకు రసాలు
షడ్రుచుల ఉగాది....
చక్కని జీవితాలు ఆనాడు...!!
పై పై మెరుగులు
కల్తి సరుకులు
గమ్మత్తైన మమకారాలు కలిపిన
నటనే జీవితం ఈనాడు...!! 
భేషజాలు లేని మనసుల ఉగాది ఆనాడు...!!
భేషజాలతో కలగలిపిన ఖరీదైన ఉగాది ఈనాడు....!!
పచ్చని తోరణాల పండువెన్నెల ఆనాడు.....!!
పచ్చదనమే లేని కాన్వాసు రంగులు ఈనాడు....!!
ఏది ఆ మధుర కోయిల మత్తెక్కించే గానం...?
లేమావి చివురులు దొరక లేదని
వెదికి వేసారి మూగబోయింది ఈనాడు...!!
మళ్ళి ఎప్పుడో అసలైన ఉగాది....!!

(
'బ్లాగులోకం' నిర్వహించిన ఉగాది కవితల పోటీలో బహుమతి పొందినందుకు అభినందనలు. మీకు బ్లాగులోకం తరపు నుంచి ఒక చిరు కానుక. 

'గోదావరి కథలు' ఈ బుక్ ని అటాచ్ చేస్తున్నాను. )

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Karthik చెప్పారు...

నిజం చెప్పారు.. ఎ రొజుల్లో.. అసలు ఉగాది అంటెనే ఎదొ జరుపుకొవాలి అన్నట్లుగా జరుపుకుంటున్నాం..

జలతారు వెన్నెల చెప్పారు...

Congrats! ఆ బుక్ మాతో పంచుకోండి మరి :)

చెప్పాలంటే...... చెప్పారు...

తప్పకుండా పంచుకుంటాను వెన్నెల గారు ధన్యవాదాలు మీ అభినందనలకి
థాంక్యు ప్రేమ్ గారు

Sag చెప్పారు...

Congrats! చాలా బాగుంది !!

చెప్పాలంటే...... చెప్పారు...

:) Thank u Sagar garu

Karthik చెప్పారు...

na peru karthik...-:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner