12, అక్టోబర్ 2013, శనివారం

మనసు జీవితం మనిషిలో.....!!

అందని అలల  కలల తీరం
ఆశల  విహంగాల ఆరాటం
మనసు పొరల విచలిత సమరం
రెక్కలు విప్పిన ఊహల ఆంతర్యం
అంబరాన చుక్కల నంటిన సంబరం 
ఎందుకో ఈ ఆశల ఆట విడుపుల ఆనందం
అలవి కాని అనుబంధపు అనురాగం
నిజాల అబద్దాల సమతౌల్యం
జీవిత పరిణామ క్రమాల ఆహార్యం
కోపాల తాపాల కోరికల కోసం
మోసాల ద్వేషాల మతాల మారణహోమం
రగులుతున్న రావణ కాష్టాల దర్పణం
మరుగుతున్న మరలుతున్న మానవత్వం
మసిబారుతున్న మానవ బంధాల మరో రూపం
ఇదేనా నేటి మన జన జీవితం....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Meraj Fathima చెప్పారు...

ఇదే జీవితం ,చాలా చక్కగా చెప్పారు.

అజ్ఞాత చెప్పారు...

నిజంగా నిజం చెప్పారు....అద్బుతంగా.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అక్కా... అను నిజాన్ని ఒప్పుకున్న మీ మనసుకు వందనం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner