25, అక్టోబర్ 2013, శుక్రవారం

సర్దుకు పోతున్నాం....!!

జీవితం అంటేనే సర్దుకుపోవడం....ఇలా అనుకుంటూనే జీవితం చివరి వరకు గడిపేస్తూ సరిపెట్టేసుకుంటూ బతికేస్తున్నాం...మూడు సర్దుబాట్లు ఆరు దిద్దుబాట్లుగా...!! కాకపొతే సరిపుచ్చుకునే వాళ్ళు సరిపెట్టుకుంటుంటే అది వాళ్ళ ఖర్మ... చాతగానితనం అనుకుంటూ...మన రాజయోగం మనదే అని మురిసిపోతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కొందరు...ఆ రాజి పడటంలో ఎన్ని సంఘర్షణలు..సమాధానం దొరకని ప్రశ్నలతో సతమతమౌతున్నారో ఆలోచించరు. మొదటి నుంచి చివరి వరకు సర్దుకోవాలి అంటూనే ఉంటే చిన్న చిన్న సంతోషాలను కూడా నష్టపోవడమే తప్ప ఇక అంతం అనేది లేకుండా పోతోంది ఈ సర్దుబాటు జీవితాలకి....!!
సరదాగా సర్దుకు పోదాం పోయేదేం ఉందిలే అనుకుంటాం మొదట్లో .... రాను రాను  అలానే సరిపెట్టుకుంటూ ప్రతి దానిలోనూ రాజి పడిపోతూ ఒక రకమైన నిరాసక్తకి లోనై పోతాం...మనని మనం మరిచిపోయి....!! అలా అని అన్ని విషయాల్లోనూ మన పంతమే నెగ్గాలని చూడకూడదు ఎదుటి వారి వ్యక్తిత్వానికి విలువ ఇస్తూ సర్దుకోవడమో సర్ది చెప్పుకోవడమో చేస్తే కాస్త బావుంటుంది. సర్దుకున్న ప్రతిసారి మరో కష్టానికో ... నష్టానికో తెర తీస్తూ ఉంటే సరిపెట్టుకోవడంలో అర్ధమే లేదు...!! సున్నితమైన బంధాలను మంచితనం ముసుగులో కఠినంగా బాధిస్తుంటే ఎంత కాలం ఆ సున్నితత్వం ఉంటుంది..?? ఓ వైపు తెగేదాకా లాగుతూ మరో వైపు నటిస్తూ ఉంటే ఎన్నాళ్ళు తట్టుకోగలుగుతుంది బంధం తెగిపోకుండా....!! మనం చేసిందే మనకు తిరిగి వస్తే భరించలేక పోతున్నామెందుకు...?? మనం  చేసింది తప్పు కానప్పుడు ఎదుటివారు మనకు చేసింది కూడా సబబే అని అనుకోలేక పొతున్నామెందుకు..?? జీవం నింపిన బతుకుని జీవశ్చవాలుగా చేసుకుంటే నష్టం ఎవరికి...?? చాలా తెలివైన వాళ్ళం అనుకుంటూ గాలికి తిరిగేస్తూ అన్నం పెట్టిన చేతిని కూడా దారుణంగా తిట్టే మన సంస్కారం ఎంత ఉన్నతమైనదో...!! ఎంత చక్కని పద్దతిలో పెరిగామో...!! రూపాయి కోసం అమ్మని నాన్నని విడదీసే గొప్ప మనసు ఒకరిది....అహంకారాన్ని ఆత్మ గౌరవమని అనుకుంటూ ఏకాకిలా నియంత ఒకరు....ఎవరు ఎలా పొతే నాకేంటి నేను బాగున్నానా లేదా నాకు కావాల్సిన వాటికోసం ఎంత మందినైనా మార్చేస్తాను నాకేంటి...అని ఒకరు....ఇలా స్వార్ధం మనస్సులో గూడు కట్టుకుని పోతుంటే....ఒక నిర్భయ ఏంటి...అభయ కాదు...ఆయేషా కాదు మరెన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి...మన పని మనం చేసుకు పోతూనే ఉంటాం...మన సమస్యలే మనకి పెద్దగా కనిపిస్తూ వాటిలోనే కొట్టుమిట్టాడుతూ ఇలానే జీవితాలని ముగిస్తూ ఉంటాం....!! 

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

Good...reasonable argument. I agree with Ur views...

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అను గారు నాతొ ఏకీభవించినందుకు

vemulachandra చెప్పారు...

అన్ని విషయాల్లోనూ మన పంతమే నెగ్గాలని చూడకూడదు ఎదుటి వారి వ్యక్తిత్వానికి విలువ ఇస్తూ సర్దుకోవడమో సర్ది చెప్పుకోవడమో చేస్తే కాస్త బావుంటుంది. సర్దుకున్న ప్రతిసారి మరో కష్టానికో ... నష్టానికో తెర తీసే పరిస్థితులకు తావియ్యకుండా ....!

బాలన్స్డ్ గా సర్దుకుపోవడం ఆవశ్యకతను చక్కగా చెప్పారు. చాలా విషయాలను ప్రస్తావించారు. మీ భావనలతో నేను ఏకీభవిస్తాను.

అభినందనలు మంజు గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు మీ ప్సందనకు... నా భావాలతో ఏకీభవించినందుకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner