5, అక్టోబర్ 2013, శనివారం

జీవితమే లేని స్త్రీ మూర్తి...!!

ఎప్పుడు ఎవరో ఒకరి అండతోనే బతకాలి
చీదరింపుల నీడలో సేద తీరాలి
నాన్న ఆసరాతోనో అన్నదమ్ముల అండ దండలలోనో
తెలిసి తెలియని ప్రాయాన్ని గడిపి
తనను తాను తెలుసుకునే సమయంలో.... 
ఓ అయ్య చేతిలో పెట్టి భారాన్ని
తీర్చుకున్నామనుకునే కన్నవారు
సేవలు చేయించుకుంటూనే...
ఉద్దరించాను నీ జీవితాన్ని....
కష్టాలన్ని నావే అంటూ.... 
మోయలేని బరువుని మోస్తున్నాననుకునే
అజమాయిషీలో అహాన్ని చూపించే భర్త గారు...
అదే వారసత్వాన్ని అందుకున్న బిడ్డలు....
అందరి కోసమే జీవిస్తూ తనకి ఉనికే లేకుండా
తనకంటూ ఓ జీవితమే లేని స్త్రీ మూర్తి...!!
అన్ని భరిస్తూ ....సహిస్తూ....
ఏమి చేసుకోలేని నిస్సహాయతో...
నిర్వికారమో...నిశ్చలత్వమో...!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శశి కళ చెప్పారు...

sthree goorchi chakkagaa vraasaaru andi

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నిజమే కదా! ఇంకా ఇలా ఉండటం అవసరమే నంటారా? తనకి ఏం కావాలో తెలుసుకోడా... మరి .
ఈ త్యాగాలు అవసరం కాదేమో..నండీ!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు శశి గారు
త్యాగం కాదు వనజ గారు బంధాలకు బంధి అండి అవి తెంచుకోలేక కొన్ని జీవితాలు ఇలా...ధన్యవాదాలు మీ స్పందనకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner