1, ఆగస్టు 2014, శుక్రవారం

అసలైన నమ్మకం కోసం.....!!

కోపం శాపమై కాటేసినా
కన్నీరు కావేరిలా పొంగినా
నీ చెంతన అందే వరాల
వెండి వెన్నెల కోసం....

వేల జన్మలుగా
వేచి చూస్తున్నా
తెరచాటు దాటిరాని
నీ స్నేహం కోసం ....

కోటి ఆశలతో కోరుకుంటున్నా
కొత్త చివుర్ల అందాలతో
సరికొత్త జీవితానికి జతగా 
కమ్మని నీ చెలిమి కోసం...

పదాల వెల్లువ స్వరాల చేరువ
మాటల చాటున దాగిన
మౌనం చెప్పే కబుర్లు
వినే మనసు కోసం....

అంది అందని ఆనందం
దొరికి దొరకని అనుబంధం
దగ్గర కాలేని దూరం చేసిన
మాయాజాలం కోసం....

బాసటగా చేరిన స్నేహం
బంధంగా మారిన క్షణం
అందిన చేయి వదలని
అసలైన నమ్మకం కోసం.....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...

భావానికి , భావానికీ ఎడం అవసరం . అప్పుడే ఆ రచంకు అందం చేకూరగలదని నా భావన .
నచ్చితే అమలు చేయటంలో ఆలస్యం చేయవద్దు .

చెప్పాలంటే...... చెప్పారు...

తప్పకుండా అండి ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner