23, ఆగస్టు 2014, శనివారం

నలుగురు మనుష్యులు.....!!

మనం అనుకుంటూ ఉంటాము మన అంత నిజాయితీ పరులు ప్రపంచంలోనే లేరు అని....కాని అది చెప్పాల్సింది మన  పక్కన ఉండేవారో లేదా మనతో ఉండేవారో చెప్పాలి.... మనం పక్క వారికి కీడు చేయవచ్చు కాని మనకు అధికారం చేతిలో ఉంది అని అందరిని భయపెట్టి బతుకుదామంటే ఎలా సరిపోతుంది లెక్క...!! మనం ఒకరి లెక్కలు సరిచేడ్డామంటే మన లెక్కలు సరి చేసే వారు మరొకరు ఉంటే అది తట్టుకోలేము ఎలా అండి ఇలా అయితే.... అధికారాన్ని ఊరి  కోసం ఉపయోగించాలి కాని మన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటునే ఉన్నాము ఎప్పటి నుంచో....!! ఒకసారి నెగ్గాము కదా అని ప్రతిసారి లెక్కలు మనకే అనుకూలం అనుకుంటే ఎలా అండి.... మీకు కలక్టర్ తెలిస్తే మీ పని అయిపోతుందా....నీతి న్యాయం అనేవి ఉండనక్కరలేదా.... మనం మన ముందు వాడిని ఇబ్బంది  పెడితే మనకన్నా పై వాడు మన దారిలోనే వెళతాడు కదా.... మనం చేసినప్పుడు తప్పు అనిపించనిది మన దగ్గరికి వచ్చేసరికి మారిపోతోందా....!! మనం చూపిన దారే కదా మరి తప్పెలా అవుతుంది.... ఉపసభాపతి మీ చేతిలో ఉంటే జిల్లాలో ఏం చేసినా సరిపోతుందా ....!! చదువు అధికారం ఉండగానే సరి కాదు సంస్కారం అనే పదాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు కాస్త అది వెదకండి మీకు తెలియక పోతే కాస్త పుస్తకాల్లో వెదకండి కనిపిస్తుంది అర్ధం.....!! న్యాయం ధర్మం అనేవి అందరికి సమానమే అని గుర్తు చేసుకుంటే రేపు పొతే మోయడానికి నలుగురు మనుష్యులు అందుబాటులో ఉంటారు.....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

ఇంతకీ మీకు మండలి మీద ఎందుకు ఇంత కోపం వచ్చిందో కూడా చెబితే బాగుంటుందేమో కదండీ.

చెప్పాలంటే...... చెప్పారు...

mandali gaari mida kaadandi vari peru cheppukuntu vari దగ్గర నటించే వారిపై ..... mi peru rayadaaniki kudaa samkochinchaare :)

Krishna K చెప్పారు...

సంకోచం ఏమీ లేదు లెండి, దివి సీమకు అనుబంధం ఉన్నవాడిని (నాగాయలంక చుట్టరికం), మండలి కొంచం మెతక (నా ఉద్దేశ్యం లో), నాకు కాస్త పరిచయం ప్రవాసం వచ్చినప్పుడు, అందుకని అడిగాను, అంతే :-)

ఇబ్బంది అనుకుంటే మండలి తో నే ఓ సారి డైరెక్ట్ గా మాట్లాడెయండి. When I met him he seems to have his foot on ground, unlike typical politician (ofcourse he was not deputy speaker then though) )

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు మీ స్పందనకు...అంత అవసరం లేదు లెండి ఆయన మాకు బాగా తెలుసు గోటితో పోయే దానికి గొడ్డలి ఎందుకు చెప్పండి ... చాలా సంతోషం అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner