3, ఫిబ్రవరి 2015, మంగళవారం

ఏక్ తారలు....!!

2/2/15
1. అమ్మనే మరిచిన వారికి_సాధ్యం కానిదేది
2. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి_కూడబెట్టిన ఆస్థులు వెక్కిరిస్తున్నాయి
3. నిదురే రానంటోంది_కలలకు చేరువగా
4. అతి సామాన్యమే_అందరిలో ప్రత్యేకంగా
5. కవ్వింతల తుళ్ళింతలే_తలపులకు చేరువగా
6. మది గూడులో_మానవతే దైవమై జీవితాలకు అండగా
7. అరనవ్వు చాలదూ_జీవితంలో 'అర్ధ'భాగమవడానికి
8. మదిని సూదుల్లా పొడుస్తున్నాయి_నీ మాటల తూటాలు
9.  అందని జాబిల్లికి అందమెక్కువ_నీ సొగసులు తనవనేమో
10. నిలిచి పోయింది ప్రాణం_నిన్ను తనలో దాచుకుంటూ
11. మనసు కాన్వాసుపై_గీసిన ప్రతి చిత్రము నీదే
12. పునర్జన్మగా మార్చుకుంటున్నా_నీ ఆశల ఆలంబనతో
13. శిదిలాలనే శిల్పాలుగా చెక్కుతున్నా_నీ జ్ఞాపకాలను చేర్చి
14. బంధాన్ని పెంచుకుంది_నీతో నిలవాలనే
15. నా  మదిని తెలిపిన చిత్రం_ప్రేమ రంగులను అమరంగా చూపిస్తూ
16. అద్దంలో నీ రూపమే_నా మదిని చూపిస్తూ
17. నేనే నీవయ్యాను_నీలో నన్ను చూసుకుంటూ
18. వాస్తవంలో నువ్వే_నా చెంతనే

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner