24, ఫిబ్రవరి 2015, మంగళవారం

చాలా చిన్న కోరిక...!!

ముక్కోటి దేవతలకు నా విన్నపం ఒక్కటే ... ఏదో చాలా చిన్న కోరిక... మీరు నా కోరిక తీర్చిన వెంటనే మీ ముడుపులన్ని చెల్లిస్తా... ఇదుగో నా చిన్న కోరిక.. ఒక్కసారి నేను ప్రధాన మంత్రిని అయితే తిరుపతి వెంకన్నకు ఏడు తులాల తొడుగు చేయిస్తా... బెజవాడ దుర్గమ్మకు వజ్రపు ముక్కు పుడక కానుకగా ఇస్తా... శ్రీశైలం మల్లన్నకు బంగారు నందిని బహుమతిగా ఇస్తా... ఇంకా ఇలా బోలెడు కానుకలు ముక్కోటి దేవతలకు సమర్పిస్తా... కాకపొతే మనలో మన మాట నా సొమ్ముతో కాదండోయ్ మీ సొమ్ముతోనే.... నా దగ్గరేముంది చెప్పండి ఏదో మీ అందరి అభిమానం తప్ప... దానితో కానుకలు చెల్లించలేను కదా... ఈ విషయంలో నాకు కె సి ఆర్ గారే ఆదర్శం అండి... -:)

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Jai Gottimukkala చెప్పారు...

సెక్యులర్ వ్యవస్తలో వాస్తు, మొక్కు లాంటి వాటికి స్థానం ఉండకూడదన్న విషయం కాస్సేపు పక్కన పెడదాం. కెసిఆర్ మొక్కుకున్నది తాను గద్దె ఎక్కాలని కాదు, తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని. తన స్వార్థం కాక ప్రజాభీష్టం నెరవేరాలని కోరుకున్నందుకు మెచ్చుకోవాల్సిందే.

చెప్పాలంటే...... చెప్పారు...

అందుకే కదా మరి ప్రజా ధనం మొక్కులుగా చెల్లిస్తోంది ... అంత గొప్ప వాడైతే తన సొమ్ముతో మొక్కులు చెల్లించొచ్చు కదా .. మేము చప్పట్లు కొట్టే వాళ్ళం

Jai Gottimukkala చెప్పారు...

నేను మొక్కులను సమర్తించలేదు, మొక్కుకున్న విషయం ప్రజాక్షేమం అని గుర్తు చేసాను.

చెప్పాలంటే...... చెప్పారు...

అది ప్రజా క్షేమం కోసమా అండి ఒక్కసారి మిరే మనసు పెట్టి ఆలోచించండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner