5, ఫిబ్రవరి 2015, గురువారం

ఏక్ తారలు....!!

3/2/15
1. అందిన చేయి వదల గలదా_కడ వరకు
2. మనసు పారేసుకున్నా_మాయ చేసిన ప్రేమకు
3. నిర్వేదనకు చరమగీతంగా_వెల్లువైనాయి నీ కలల కావ్యాలు
4. శున్యాన్నే దూరం చేస్తూ_నాతొ నీ జ్ఞాపకాలు
5. నీ చుట్టునే నా పరిభ్రమణం_హృదయాంతరాలను స్పృశిస్తూ
6. మనసులో కురిసే జడివానలెన్నో_నీ జ్ఞాపకాల కలలకు సాక్ష్యాలుగా
7. మది భావాలే_ఈ అక్షరాల ఆనవాళ్ళు
8. కొత్త రంగులు పులుముకుంటున్నాయి_హరివిల్లై మెరిసిన నీ జ్ఞాపకాలు
9. నవ వసతానికి నాంది పలికాయి_చివురిస్తున్న నీ ప్రేమ సంకేతాలు
10. ఏకాంతంలో సైతం_ఒంటరిని కానియని నీ జ్ఞాపకాలు
11. బతుకు బరువుకు_అలసి సొలసాయి కళలు సైతం

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner