1. నీ పలుకే_నాకు మరణ శాసనం
2. అక్షరం నేర్పించే ఇంగితమే_జీవిత జ్ఞానోదయం
3. యంత్రాలు నడిపించే జీవితం_దైవాన్ని సైతం ధిక్కరిస్తూ
4. చిత్తం తేటతెల్లమే_చిత్రంలో ప్రతిబింబిస్తూ
5. తల రాతలో రోతని చేరుస్తూ_జీవశ్చవం
6. అందరివాడు గోపాలుడు_అందుకే లోకమంతా ప్రేమ మ(మా)యం
7. నీ తలపుల ఊపిరి పోసుకుని_సజీవ శిల్పమయ్యాను
8. నిను చూడలేని కనులకు_నిమిషాలు యుగాలే
9. రాచరికపు హోదాని నీ కందించి_పేదదయ్యింది గతం
10. కొత్త చివురుకి తెలిసింది_అంటుకున్న నిజాయితీ కన్నీళ్ళ విలువ
11. జీతాల పెరుగుదల నేలపై_నింగిలో తారకలు జీవితపు ఖర్చులు
12. అందలేదని వగరుస్తూ_అందని ద్రాక్ష పుల్లనంటే ఎలా
13. పాత మొక్క ప్రాణం కొడిగట్టింది_కొత్త చివురు చూడకనే
14. చెలిమి చెలమలో సేదదీరా_నిజమైన నీ ఆత్మీయతా ఒడిలో
15. తాళినే ఛెళ్ళు మనిపిస్తూ_తాగుడుపై యుద్ధం
16. సరిగమలు ఒలికి పోయాయి_కాగితపు పడవల సందేశాల బరువుకు
17. అబద్దానికేం తెలుసు_క్షణాల తన అలంకరణ నిజం ఇచ్చిందని
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చక్కని తారలు
అభినందనలు మంజు గారు!
ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి