కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహా పురుషులౌతారు అన్న మాటలకు అక్షరాలా సరిపోతారు శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్తా గారు... అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ఆటు పోట్లను తట్టుకుని సమస్యకు సమాధానం చెప్పగలిగిన ధీశాలిగా ఈ రోజు మన ముందుకు వచ్చారంటే ఆ మనః స్థైర్యం వెనుక ఎంత అలజడి ఉందో... అవమానాలు ఉన్నాయో... ఎన్ని నిద్ర లేని రాత్రులు ఉన్నాయో... ఎన్ని కోల్పోయిన జ్ఞాపకాలు వెన్నాడుతున్నాయో... అయినా మొక్కవోని ధైర్యం, నిరంతర శ్రమ, దానికి తగిన అకుంఠిత దీక్ష, కసి . పట్టుదల... ఇలా ఎన్నో ఆలోచనల రూపమే ఈ రోజు మన ముందు ఉన్న ఎం ఎన్ ఆర్ గుప్తా గారు.
పట్టువదలని కార్యదీక్ష ఆయన సొంతం... అదే గుప్తా గారు సాధించిన విజయాలకు మూలం... ఎంతో మంది యువత ఎంతసేపు నా వాళ్ళు చేశారు లేదా ఈ దేశం నాకేం ఇచ్చింది అనే వాళ్ళే కాని వారి ఎదుగుదలకు సోపానాలుగా మారిన కుటుంబాన్ని కాని దేశాన్ని కాని గుర్తు పెట్టుకున్న వారు ఈ రోజుల్లో చాలా అరుదు. ఆ అరుదైన వ్యకిత్వం అది మన తెలుగువాడు కావడం నిజంగా తెలుగు జాతి చేసుకున్న అదృష్టం అని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు.
భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి చదువులో అత్యున్నత స్థానాలను అందుకుని ట్రాన్స్పోర్టేషన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించి అప్పట్లో చంద్రబాబు గారికి విజన్ 2020 లో చక్కని సూచనలు అందించి మన పక్క రాష్ట్రమైన కర్నాటకకు సలహాలను అందించి తన సేవలను వినియోగించారు...
తన ప్రతిభకు మెరుగులు దిద్దుకోవడానికి విదేశాలు వెళ్ళి పరాయి వాడిని మెచ్చుకోలేని పర జాతీయులతో శభాష్ అనిపించుకున్న నేటి మేటి భారతీయుడు మన గుప్తా గారు. ఎంతో మంది యువతకు స్పూర్తి ఈనాడు.
నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు గారి పిలుపుకు స్పందించి స్వచ్చందంగా ముందుకు వచ్చి తను దేశ విదేశాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గడించిన అపార అనుభవాన్ని మాతృభూమికి అందించాలని ఆరాటపడుతూ సహజ ఒనరుల వినియోగం, రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు... పర్యాటక రాబడుల గురించి వివరాలు అందించి... నేను సైతం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, నిర్వహణకు సిద్దం అని పెట్టుబడుల సేకరణకు నడుం బిగించారు... రేపటి రోజున అత్యున్నత ప్రమాణాలతో మన రహదారులు, ప్రభుత్వ నిర్మాణాలు గుప్తా గారి ముద్రతో పది కాలాలు నిలవాలని ప్రపంచానికే తలమానికం కావాలని... ఆకాంక్షిస్తూ... మన వాడైన తెలుగు'వాడి' తెలివిని మనం గుర్తిస్తూ గర్విద్దాం తెలుగు వారిగా...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి