2. అనుబంధాలు అల్లాడుతున్నాయి_చరమాంకంలో చేయూత లేక
3. నిద్దరోతూనే ఉన్నా_కలలు కానరావడం లేదెందుకో మరి
4. గ్రీష్మం తాపంలోనే ఉండి పోయింది_తొలకరి వలపు తెలియక
5. నిశబ్దమూ మౌనమయ్యింది_మన మధ్య తాళ లేక
6. భావ రాగాలకు దాసోహమయ్యింది మది_గువ్వలా నీ గుండెలో ఒదిగి పోతూ
7. వెలుగుల తారలు వచ్చాయిగా_ఇక చీకట్లకు సెలవే మరి
8. అబద్దం అందమైనది_అద్దంలో నీ రూపాన్ని చూపిస్తూ
9. అద్భుతమైనది జీవితం_హాయిగా అనుభవిస్తే
10. ఒక్కొ చినుకే_వేల జీవాలకు ప్రాణాధారంగా
11. మనసు సంతసించింది చాలదూ_తన ఊపిరిని అక్షరాల్లో చూస్తున్నందుకు
12. గాలితో చేరినా_నీ జ్ఞాపకాలు అనుక్షణం నాతోనే
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి