కాలాన్ని తోడుగా తీసుకుని
బాంధవ్యాలను వదులుకుని, బంధాలను దాటుకుని
కన్నపేగును వదలి కాసుల కోసం పరుగులెట్టాను
మమకారాన్ని మరచి మాయలో పడిపోయాను
ఆశల విహంగాల రెక్కలతో కోర్కెల గాలాలకు చిక్కి
ఎక్కడో ఆవలి తీరాలకు తరలి పోయాను...
అలసిన నా మది తల్లడిల్లింది నిజాలను గ్రహించి
కానరాని ఆత్మీయత కోసం ఆర్రులు చాసాను కన్నీటి ధారలలో కన్నవాళ్ళ రూపాలు మసకబారాయి
రూకలకు బంధిలయినాయి రుధిరపు చుక్కలు
రక్తాశ్రువుల్లో రాలాయి రక్త సంబంధాలు
పలకరింపుల పల్లకీలు మౌనమైనాయి
వేదనల చుట్టాలు పక్కనే చేరాయి
వాస్తవాలు వద్దన్నా వెంట పడ్డాయి
అమ్మ ఒడిలో సేదదీరాలన్న ఆతురత అక్కునజేరి
పరుగు పరుగున పయనమయ్యాను మాతృభూమికి...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి