మనకు అవసరం లేనివి పలకరింపుల క్షేమ సమాచారాలు... స్నేహం అంటే మనకు తెలియదు కాని మనల్ని మనంగా అభిమానించడం మాత్రమే మనకు తెలుసు... స్నేహం అంటే ఇష్టమో ప్రేమో ఇప్పటికీ తెలియదు కానీ ఎప్పటికీ మనతోనే ఉండిపోతే బావుండు అని మాత్రం అనిపించేది స్నేహం.... కాలాలు మారినా యుగాలు గడచిపోయినా స్నేహంలోని తీయదనం ఇప్పటికి అలానే ఉండి పోయింది... అవసరానికి స్నేహం నటించేవారు దానిలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేరు.. నీ తప్పొప్పులతో నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు, స్వాగతించేవారు నీ ప్రియ నేస్తాలు.... స్నేహంలో గంటల తరబడి మాటలు పంచుకోనవసరం లేదు... నెలల తరబడి కలిసి ఉండనక్కరలేదు...సప్త సముద్రాల ఆవల ఉన్నా ఎన్నేళ్ళు గడచినా మనస్సులో చిరస్థాయిగా మిగిలే స్నేహం ఎక్కడో నూటికి కోటికి ఒక్కటి... దీనికి బంధాలు బంధుత్వాలు అవసరం లేదు.. ఆత్మీయ పలకరింపు ఒకటి చాలు ... ఏళ్ళ తరబడి స్నేహ సౌరభం నిలబడి పోవడానికి.. కొందరికేమో చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా జీవితాంతం నిలిచిపోతాయి... మరికొందరేమో ఈ రోజువి రేపటికి మ ర్చిపోతారు... కొందరేమో జ్ఞాపకాలోనే బతికేస్తుంటే ఇంకొందరికేమో అసలు జ్ఞాపకాలే ఉండవు...ఏమిటో ఈ జీవితాలు...
వెన్నెల్లో చందమామను పరిచయం చేసుకున్నట్టుగా... చీకట్లో అక్కడక్కడా కనిపించే నక్షత్రాలను
ఏరుకుంటునట్లుగా బాల్యాన్ని దాటేసి ప్రాయపు పరుగుతో పోటి పడినా విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న స్నేహం చిన్ననాటి జ్ఞాపకాలది... అందుకేనేమో మన వయసు ఎంత పెరిగినా మళ్ళి బాల్యాన్ని తలచుకుంటూ ఉంటాము... కల్మషం ఎరుగని పసి వయసు స్నేహం ఎప్పటికి మధురమైనదే...
ఇంతకీ స్నేహంలో ఇష్టం ఉందంటావా... ప్రేమ ఉందంటావా.... -:)
నీ నేస్తం...
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
హిమాలయాలంత స్వచ్చమైనది స్నేహం ,చాలా బాగా వ్రాసారు .
హిమాలయాలంత స్వచ్చమైనది స్నేహం ,చాలా బాగా వ్రాసారు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి