6, నవంబర్ 2016, ఆదివారం

నిషిద్దాక్షరాలు....!!

నిలకడలేని ఆలోచనా సంద్రాన్ని
మోపలేని మది మౌన భారాన్ని
తేటతెల్లం చేసే భావాలు అలిగిన వేళ

జీవకణాలు చేతనాన్ని కోల్పోతున్నప్పుడు
చీకటి చుట్టం పరామరికకు వచ్చినప్పుడు
వెలుగుదారులు మూసుకుంటున్న వేళ

గుండె గది గుట్టుగా దాచిన జ్ఞాపకాలు
వదిలేసినా వెంబడిస్తుండే వాస్తవాలు
అన్ని కలగాపులగంగా కలసిన వేళ

ఎప్పటికప్పుడు పడిలేస్తున్నా
తగిలిన గాయాల తడి తాకుతున్నా
ఒప్పుకోలేని ఓటమి గెలుపే నిషిద్దాక్షరాలైన ఈ అక్షరాలు...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner