ఆగని కాలంతోపాటు అర్ధనగ్నంగా
చడి చప్పుడు లేని నైరాశ్యాలను
చీకటి తోడై చూస్తోంది నిర్లిప్తంగా
వెచ్చని పొత్తిళ్ళ నుంచి జారిపడి
ఉలిక్కిపడుతున్న జ్ఞాపకాలను వారిస్తూ
మాటాడక మారాము చేసే మౌనాన్ని
బుజ్జగించే ఊరడింపుల తాయిలాలను అందిస్తూ
రెప్పచాటున దాచిన గుప్పెడు గుండె కలవరాన్ని
అప్పుడప్పుడు పలకరించే కలలకు అప్పజెప్తూ
ఓదార్పులు దరిచేరని ఒంటరి పయనంలో
దిగాలుతో మొరాయించే మదిని సముదాయిస్తూ
ఏకాంతానికి అర్ధాలు వెదికే క్రమంలో
ఆత్మీయత అందలాలెక్కిందని సంతసిస్తూ
దూరాల తీరాలు చేరువ కావాలని పరుగెడుతూ
వెంట వచ్చే వేకువ వెలుతురు వాకిలికి స్వాగతిస్తూ.....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి