22, నవంబర్ 2016, మంగళవారం

సాగర సంగమం...!!

నేస్తం,  
          ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న నాలుగు మాటలు. నాకు బాగా నచ్చిన సాగర సంగమం సినిమా గురించి. నేను ఏడవ తరగతి చదివే రోజుల్లో వచ్చింది. అప్పట్లో పాటలు అంటే బాగా ఇష్టం , ఇప్పుడు కూడా పాటలు ఇష్టమే. పాటల పుస్తకాలు కొని మరీ పాడిన పాటలు బోలెడు. ఎన్నిసార్లు చూసినా మళ్ళి మళ్ళి చూడాలనిపించేంత ఇష్టమైన సినిమాల్లో ఈ సాగర సంగమం ఒకటి.
         విశ్వనాధ్ గారు ఎలా తీశారో కానీ ఓ జీవితాన్ని సంపూర్ణంగా చూపించారు అనడానికి ఈ సినిమా ఒక్కటే అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి సాక్ష్యం. స్నేహం అంటే ఏమిటో, ప్రేమ, ఆరాధన, కోపం, ఆవేశం... ఇలా అన్ని రసాలు మేళవించి ఒక వ్యక్తికి ఆపాదించడం అంటే సామాన్య విషయం కాదు. ఇష్టమైన కళకు జీవితాన్ని అంకితం చేసి దానిలోనే తన హృదయాన్ని దాచుకున్న ఓ అద్భుత వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. కమల్ కనిపించరు నాకు ఈ సినిమాలో బాలునే కనిపిస్తారు. అమ్మ కోసం ఓ కొడుకు తన చిరకాలపు జీవితపు కలను సాకారం చేసుకోకుండా అమ్మకు అంకితం చేయడం, అవమానాన్ని భరించడం, ఓ తల్లి కూతురు మధ్య అపార్ధాలు .. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే.
       పాటల్లో సహజత్వం, వేదం అణువణువున నాదం ... తకిట తధిమి తందానా ... ప్రతి పాట ఓ ఆణిముత్యమే. సహజత్వంతో సహజాతంగా మనకు అందిన అపురూప చిత్ర రాజం " సాగర సంగమం  ".

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner