చాటుమాటు స్నేహాల మాయలో
సూటిపోటి మాటల చురుక్కులను
తట్టుకోలేని మనసు చస్తూ బతుకుతూ
తప్పొప్పుల చిట్టాపద్దులు దాచేసి
మంచితనపు ముసుగు వేసుకుంటే
సమాజపు గుంపులో కలిసిపోయి
వాళ్ళలో మనమూ ఒకరమే అనుకుంటూ
మనదైన చీకటి సామ్రాజ్యంలో
తిరుగులేని మహరాజులా/రాణిలా
వెలుగుతున్నామని భ్రమలో పడిపోయి
వాస్తవాన్ని ఎద్దేవా చేస్తుంటే
నిజాయితీకి కోపం వచ్చి
నివురులా కమ్మేసి
నిప్పుల కొలిమిలో కాల్చేస్తుంది
తస్మాత్ జాగ్రత్త...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి