12, నవంబర్ 2016, శనివారం

వాస్తవాలు ఎప్పుడు వెలుగు చూసేనో...!!

నేస్తం,
         నాకు అర్ధం కానిది ఒక్కటే.. మనం అవినీతిపై యుద్ధం చేస్తున్నామా లేక అబద్దాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నామా.. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మనం ఎటు వైపు పోతున్నామో తెలియడం లేదు. కొద్దో గొప్పో బతుకులీడుస్తున్న మధ్య తరగతి వాళ్ళ సంగతి పక్కన పెడితే సామాన్యుల సంగతే ఏమి తేలడంలేదు. ఇంత అర్జెంట్ గా 500, 1000 నోట్లు రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో. అందరు ఆశ పడుతున్నట్లు నల్లధన కుబేరులు బయటకు వస్తారు అనుకోవడం " నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉందో " ఇది అంతే.  చేయాల్సిన పనులు చాలా ఉండగా ఈ నోట్ల రద్దు ఒక్కటే ప్రధాన సమస్యగా చేసి జనాన్ని ఇబ్బందులపాలు చేయడంలో కృతకృత్యులయ్యారు నాయకులు. తెలివిగల పెద్దలు ముందే అన్ని తెలుసుకుని నల్లధనాన్ని పెట్టుబళ్ళుగా పెట్టి తెల్లధనంగా మార్చుకున్నారు.. పేర్లు అందరికి తెలుసులెండి. జియో సిమ్ వాడే అందరికి ఈ పాటికి అర్ధం అయ్యే ఉంటుంది. తెలివి అంటే అలా ఉండాలి. నోట్లు రద్దు చేసాక అందరు బోలెడు నీతులు చెప్తున్నారు. వీరిలో ఎంత మంది సక్రమంగా పన్ను కడుతున్నారు. అసలు ప్రక్షాళన చేయాల్సింది రాజకీయాలను. అవి వదిలేసి తమకు కొమ్ము కాసే వారికి అనువుగా చట్టాలు చేసే ముందే వారి అనుమతి తీసుకుని, వాళ్ళు అందరు క్షేమంగా తెల్లధనాన్ని దాచుకున్న తరువాత తీరికగా అప్పటికప్పుడు సామాన్యుల మీద బరువులు వేసి చేతులు దులుపుకోవడంతో మళ్ళి చరిత్ర  పునరావృతం కావడం తప్ప మనకు ఒరిగిందేమిటి. చిల్లర కోసం పడిగాపులు పడటమే మిగిలింది. నోట్ల రద్దులో వాస్తవాలు ఎప్పుడు వెలుగు చూసేనో...!!

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

peddavaallu eppudo sardesaaru. kaasta peddavaallu eesee gaa bank la dwaarane marchestunnaaru.
vaallaki vellakane kotta karency prajalki vastundi. tippalannii saamaanyulake;;

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner